Monday, 25 October 2021

నమ్రతకు అది నచ్చదట.. అసలు విషయం చెప్పిన మహేష్ సతీమణి

సూపర్ స్టార్ ఫ్యామిలీ ప్రస్తుతం ఎక్కడుందో అందరికీ తెలిసిందే. పరుశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీస్, జీఎంబీ సంయుక్తం నిర్మిస్తోన్న చిత్రీకరణంలో మహేష్ బాబు బిజీగా ఉన్నాడు. అది కూడా విదేశాల్లో జరుగుతున్న ఈ షూటింగ్‌కు తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాడు. గత వారం రోజులుగా మహేష్ బాబు ఫ్యామిలీ స్పెయిన్‌లోనే ఉంది. కీర్తి సురేష్, మహేష్ బాబుల మీద సాంగ్ షూటింగ్ జరుగుతోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ నేతృత్వంలో ఈ సాంగ్ షూట్ జరుగుతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబుకు మళ్లీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. తమన్ ఇచ్చిన అద్భుతమైన పాటలకు శేఖర్ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తమన్ కొట్టి పాటలకు ఫిదా అయినట్టు తెలుస్తోంది. తమన్‌కు నమ్రత ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడంతోనే ఆ విషయం అర్థమైంది. మహేష్ బాబు తన షూటింగ్‌లతో బిజీగా ఉంటే..నమ్రత మాత్రం పిల్లలతో అక్కడి వీధులన్నీ కూడా తెగ చుట్టేస్తోంది. నమ్రతకు సోమవారం అంటే నచ్చదట. మామూలుగానే అందరికీ వీకెండ్ అంటే చాలాఇష్టం. అలా వీకెండ్ ఫుల్లుగా ఎంజాయ్ చేసిన తరువాత మళ్లీ పనులు ప్రారంభించాలి. కొత్త వారం స్టార్ట్ చేయాలంటే నచ్చదు. అందుకే చాలా మందికి సోమవారం అంటే నచ్చదు. అందులో తాను కూడా ఉన్నట్టు తాజాగా నమ్రత చెప్పేసింది. దీపావళికి సర్కారు వారి పాట నుంచి ఏదో ఒక అప్డేట్ రానున్నట్టు తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ZnAYDU

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....