Sunday, 24 October 2021

Bigg Boss5 Telugu: బిగ్‌బాస్ తెచ్చిన క్రేజ్‌.. నటరాజ్ మాస్టర్‌కు బాలకృష్ణ బంప‌ర్ ఆఫ‌ర్‌!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ర‌న్ అవుతోంది. ఈ షో నుంచి ఇప్ప‌టికే కొంద‌రు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌కు కూడా ఈ షోలో పాల్గొన‌డం వ‌ల్ల సెల‌బ్రిటీ స్టేట‌స్ వ‌చ్చేస్తుంది. ఒక‌ప్పుడు ఏం బిగ్‌బాసో ఏమో అనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు ఆ టైమ్‌లో టీవీల‌కు అతుక్కుపోతున్నారు. ఇలా బిగ్‌బాస్ సీజ‌న్ 5 నుంచి ఎలిమినేట్ అయినా కూడా క్రేజ్ ద‌క్కించుకున్న వారిలో డాన్స్ మాస్ట‌ర్ న‌ట‌రాజ్ ఒక‌రు. ఆయ‌న డాన్స్ మాస్ట‌ర్‌గా ఎంత మందికి పెద్ద‌గా తెలుసో లేదో కానీ.. బిగ్‌బాస్‌లో పాల్గొన‌డం.. ఆయ‌న అక్క‌డ ఎమోష‌న‌ల్ కావ‌డం ఇవన్నీ ఆయ‌న‌కు జ‌నాల్లో క్రేజ్‌ను తీసుకొచ్చింద‌న‌డంలో సందేహం లేదు. ఇప్పుడు అదే క్రేజ్ ఆయ‌న‌కు మ‌రో బంపర్ ఆఫ‌ర్‌ను కూడా అందించింది. ఇంత‌కీ ఆ ఆఫ‌ర్ ఏంటో తెలుసా!.. న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌కు నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి వ‌ర్క్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. వివ‌రాల్లోకెళ్తే.. నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు త‌దుప‌రి సినిమాను స్టార్ట్ చేయ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది. అయితే ఆలోప‌లే ఆయ‌న డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. తొలిసారి ఆయ‌న డిజిట‌ల్ తెర‌పై ‘అన్‌స్టాప‌బుల్‌’ అనే టాక్‌షోతో సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 4 నుంచి ఆహాలో ప్ర‌సారం అవుతుంది. ఈ షో ప్రారంభం ముందు బాల‌య్య ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి అక్క‌డున్న డాన్స‌ర్స్‌తో క‌లిసి స్టెప్పులేస్తారు. దీనికి సంబంధించిన కొరియోగ్ర‌ఫీని న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ట‌. రీసెంట్‌గా బాల‌కృష్ణ‌తో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ దిగిన ఫొటో నెట్టింట వైర‌ల్ కావ‌డంతో ఆ విష‌యం అంద‌రికీ తెలిసింది. మ‌రి బాల‌య్య‌తో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎలాంటి స్టెప్స్ వేయిస్తాడ‌నేది తెలియాలంటే మాత్రం షో వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 5లో 19 మంది కంటెస్టెంట్స్ లోప‌లికి వెళ్లారు. ఎవ‌రు గేమ్ వారు ఆడ‌టానికి వంద శాతం ప్ర‌య‌త్నిస్తున్నారు. అలా ప్ర‌య‌త్నించిన వారిలో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఒక‌రు. ఆయ‌న భార్య ఏడు నెల‌ల గ‌ర్బిణిగా ఉన్నప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆయ‌న ఎంట్రీ ఇచ్చాడు. అయితే నాలుగోవారం ఆయ‌నకు ఓట్లు త‌క్కువ‌గా రావ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. వ‌స్తే వ‌చ్చాడు కానీ.. ఇప్పుడు సెల‌బ్రిటీ కావ‌డంతో న‌ట‌రాజ్‌కు మంచి గుర్తింపే ద‌క్కుతుంది. చిన్న డాన్స‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌కు ఈ సెల‌బ్రిటీ హోదా రావ‌డంపై చాలాసార్లు త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసుకున్నాడు. ఇప్పుడు క్ర‌మంగా సినిమాలో వ‌ర్క్ చేసే అవ‌కాశాలు మ‌రింత‌గా పెరుగుతాయని కూడా టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vIKm0h

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....