Friday, 1 October 2021

Allu Arjun - Pushpa: అఫిషియ‌ల్‌.. అల్లు అర్జున్ ‘పుష్ప‌’ రిలీజ్ డేట్ ఫిక్స్‌!

ఐకాన్ స్టార్ ‘పుష్ప‌’ రిలీజ్ డేట్ విష‌యంలో చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచింది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సినిమాను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలియజేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’గా విడుదల చేస్తున్నారు. నిజానికి పుష్ప ది రైజ్‌ను ఆగ‌స్ట్ 17నే విడుద‌ల చేయాల‌నేది ప్లాన్‌. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా, మ‌రో నాలుగు నెల‌లు సినిమా వాయిదా ప‌డింది. పాన్ ఇండియా రేంజ్‌లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావ‌డంతో సుకుమార్ చాలా కేర్ తీసుకుని సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమాలో శ్రీవ‌ల్లి పాత్ర‌లో న‌టిస్తున్న ర‌ష్మిక మంద‌న్న లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాట‌ను కూడా విడుద‌ల చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమాలో అల్లు అర్జున్ ర‌గ్డ్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన బ‌న్ని క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేసే టీజ‌ర్‌, దాక్కోదాక్కో మేక సాంగ్స్ సినిమాపై హైప్ పెంచ‌డంలో స‌క్సెస్ అయ్యాయి. రంగ‌స్థ‌లం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావ‌డం ఒక‌వైపు, మ‌రో వైపు అల వైకుంఠ‌పుర‌ములో బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత బ‌న్ని చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమా గురించి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FlvIRp

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...