Sunday 10 October 2021

MAA Elections: ‘ఆ విషయమే నాకు నచ్చలేదు’.. పోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ ఏడాది అధ్యక్షులుగా పోటీ చేస్తున్న , ప్యానెల్‌ల మధ్య యుద్దం మామూలుగా లేదు. ఎన్నికల ప్రకటన వచ్చిన రోజు నుంచి ఒకరిపై మరొకరు దూషణలు చేస్తూ నానా రచ్చ సృష్టించారు. అయితే ఆదివారం ఈ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇందులో సినిమా ప్రముఖులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ వద్ద గందరగోళం కూడా నెలకొంది. 'మా' ఎన్నికల కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉదయాన్నే మంచు విష్ణు ప్యానల్ సభ్యులంతా పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నరేష్, మోహన్ బాబు, మంచు విష్ణు సహా విష్ణు భార్య విరానిక కూడా అక్కడికి చేరుకొని గెలుపుపై ధీమాగా కనిపించారు. అయితే ఓటింగ్ ప్రక్రియలో ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. పలువురి మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి. దీనంతటి ప్రకాష్‌ రాజ్‌యే కారణం అని వాదనలు కూడా వినిపించాయి. అయితే వివాదం జరగడంలో తన ప్రమేయం ఏమీ లేదు అని ప్రకాష్ రాజ్ తాజాగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం వద్ద నరేశ్ తో గొడవపై ఆయన వివరణ ఇచ్చారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా.. ఇంట్లో కౌగిలికి ఎన్నో అర్థాలుంటాయని నవ్వుతూ చెప్పారు. ఇక పోలింగ్ బూత్ లోకి ప్రకాశ్ రాజ్ గన్ మెన్లు రావడంతో విష్ణు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలోనే నరేశ్, ప్రకాశ్ రాజ్ మధ్య గొడవ జరిగింది. మోహన్ బాబు వారిని నిలువరించారు. ప్రస్తుతం ఓటింగ్ సజావుగా సాగుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3BsUxYZ

No comments:

Post a Comment

'I Want To See Myself As Johnny Depp'

'I don't think I ever lost the confidence as an actor.' from rediff Top Interviews https://ift.tt/JMxUyhe