Sunday 10 October 2021

MAA elections - Prakash Raj: ‘మా’ రగడ...రా రా నా కొడకా.. నరేశ్‌పై విరుచుకుపడ్డ ప్రకాశ్ రాజ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (‘మా’) ఎన్నిలు పైకి సాఫీగా, ఆసక్తికరంగా జరుగుతున్నాయని అందరూ బయటకు చెబుతున్నారు. కానీ లోపల పరిస్థితులు మాత్రం అలా లేవు. ‘మా’ మాజీ అధ్యక్షుడు న‌రేశ్‌పై ఇప్పుడు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్న ప్ర‌కాశ్ రాజ్ ప‌రుష ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. ‘రేయ్‌, రా రా నా కొడ‌కా...’ అంటూ , నరేశ్‌పై విరుచుకుప‌డ్డారు. ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌కు సంబంధించిన స‌భ్యులు శ్రీకాంత్‌, ఉత్తేజ్ త‌దిత‌రులు ప్ర‌కాశ్ రాజ్‌ను కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అస‌లు న‌రేశ్‌పై ప్ర‌కాశ్ రాజ్ ఎందుక‌లా ప‌రుష ప‌ద‌జాలంతో విరుచుకు ప‌డ్డార‌నే విష‌యంపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ప్ర‌కాశ్‌రాజ్ వ‌ర్గానికి సంబంధించి ఎలాంటి రిలేష‌న్ లేని వ్య‌క్తి ప్ర‌చారం చేయ‌డంపైనే గొడ‌వ జ‌రిగింద‌ని... దీనిపైనే న‌రేశ్ ఏదో అన‌డంతో ప్ర‌కాశ్‌రాజ్ త‌న‌పై ఫైర్ అయ్యాడ‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి ఈ గొడ‌వ‌లు ఇంత‌కు ముందు జ‌రిగాయా? ఇప్పుడే జ‌రిగాయా? అనేది మాత్రం తెలియ‌డం లేదు. మా ఎన్నిక‌లు ఇది వ‌ర‌కు ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేదు. ఈసారి చాలా వాడిగా వేడిగా జ‌రుగుతుంది. ప్ర‌కాశ్ రాజ్‌, మంచు విష్ణు ప్యానెల్స్ మ‌ధ్య నువ్వా నేనా? అనేంతలా పోటీ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు వంద‌ల ఓట్లు పోల‌య్యాయి. మ‌రో రెండు గంట‌ల్లో ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి కానుంది. ఈరోజు రాత్రే ఈ ఎన్నిక‌ల ఫలితాలు వెలువ‌డ‌తాయ‌ని స‌మాచారం. మ‌రి ఈ పోటీల్లో ఎవ‌రు గెలుస్తార‌నేది మాత్రం అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అంద‌రూ గ‌మ‌నిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WWKIUc

No comments:

Post a Comment

'I Want To See Myself As Johnny Depp'

'I don't think I ever lost the confidence as an actor.' from rediff Top Interviews https://ift.tt/JMxUyhe