హీరోయిన్, నటిగా ప్రేక్షకులను మెప్పించిన రోజా ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆమె తమిళ దర్శకుడు ఆర్.కె.సెల్వమణి సినిమాలను డైరెక్ట్ చేయకపోయినప్పటికీ సినీ రంగంతో అసోసియేషన్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాది సినీ కార్మికుల సమాఖ్య()కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో సినీ పెద్దల సహకారం తీసుకుని కార్మికులకు అండగా నిలవడంలో సక్సెస్ అయిన సెల్వమణి మరో అడుగు ముందుకు వేశారు. ఫెఫ్సీలో సభ్యులుగా వ్యవహరిస్తోన్న సాంకేతిక నిపుణులకు ఓ కాలనీని నిర్మించడానికి సంకల్పించారు. అందుకోసం సినీ పరిశ్రమలోని సెలబ్రిటీలు తమ వంతు సాయాన్ని అందించాలని అసోషియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్న ఆర్.కె.సెల్వమణి రిక్వెస్ట్ చేశారు. వెంటనే విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి .. ఫెఫ్సీకి కోటి రూపాయలను విరాళంగా అందించారు. యు.వి.కమ్యూనికేషన్స్ అనే సంస్థ కూడా ముందుకు వచ్చి 31 లక్షల రూపాయలను తమ వంతు విరాళంగా ప్రకటించింది. నిజంగానే రొక్కాడితే కానీ డొక్కాడని సాంకేతిక నిపుణుల కోసం ఫెఫ్సీ అధ్యక్షుడిగా సెల్వమణి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదనే చెప్పాలి. దీనికి కోలీవుడ్ చిత్ర పరిశ్రమ తమ వంతు సాయాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగానే విజయ్ సేతుపతి సెల్వమణికి కోటి రూపాయలు విరాళం అందించారు. మరి ఇంకెంత మంది స్టార్స్ విరాళాలను ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YceBAa
No comments:
Post a Comment