విభిన్నమైన సినిమాలు రూపొందించే దర్శకుడు దేవా కట్ట, సుప్రీమ్ హీరో కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా . ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు మధ్య జరిగే అంశాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్(ఐఏఎస్) పాత్రలో మనకి కనిపించారు. గత శుక్రవారం విడుదల అయిన ఈ సినిమాపై ప్రస్తుతం మంచి సక్సెస్ సాధించి దూసుకుపోతుంది. ఓవైపు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంకి గురైనప్పటికీ.. సినిమా ప్రమోషన్స్‌ని మాత్రం జోరుగా చేసింది చిత్ర యూనిట్. సెప్టెంబర్ 10వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై తన స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయి ధరమ్ తేజ్ అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇసుకలో తన బైక్ స్కిడ్ కావడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న కొందరు ఆయన్ను తొలుతు మెడికవర్ ఆస్పత్రికి ఆయన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ సాయి ధరమ్ తేజ్‌కు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆయన కాలర్ బోన్ విరిగినట్లు గుర్తించి దానికి శస్త్ర చికిత్స నిర్వహించారు. అయితే సాయి ధరమ్‌కు ప్రమాదం జరిగినప్పటికీ.. ఆయన నటించిన ‘రిపబ్లిక్’ సినిమాను మాత్రం అనుకున్న సమయానికి విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రముఖ నటులు, దర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో ఎన్నో విషయాలు సమాజానికి ఉపయోగపడేలా ఉన్నాయంటూ వాళ్లు పేర్కొన్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు, మాజీ మంత్రి ఈ సినిమాపై తన రియాక్షన్‌ని తెలిపారు. ‘రిపబ్లిక్ సినిమా గురించి అన్ని మంచి రివ్యూలు వింటున్నాను. , సాయి ధరమ్ తేజ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ అద్భుతాన్ని వీలు చూసుకొని త్వరలోనే చూస్తాను. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mnhAOy
No comments:
Post a Comment