లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది దిశా పటాని. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో అందాల విందు చేసింది. అయితే ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో దిశా పటానీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం దిశా పటానీ దూసుకుపోతోంది. వరుసగా బ్లాక్ బస్టర్‌లను కొట్టేస్తూ దుమ్ములేపుతోంది. పైగా దిశా పటానీ పర్సనల్ వ్యవహారాలన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. టైగర్ ష్రాఫ్, దిశా పటానీల మీద లెక్కలేనన్ని రూమర్లు వస్తుంటాయి. టైగర్ ష్రాఫ్, దిశా పటానీలో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోన్నారని ఇప్పటికే లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. కానీ తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని చెప్పుకొస్తుంటారు. కరోనా, లాక్డౌన్ సమయంలోనూ ఈ ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. ఆ సమయంలోనూ రకరకాల పుకార్లు వచ్చాయి. టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు దూరమయ్యారంటూ రూమర్లు వచ్చాయి. అలా వ్యక్తిగత విషయాలతో దిశా పటానీ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇక ఆమె చేసే అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో అగ్గి రాజేసినట్టు అవుతుంది. లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సమయంలో ఆమె షేర్ చేసిన రకరకాల ఫోటోలు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక వెకేషన్స్‌కు వెళ్లిన సమయంలో ఇచ్చే బికినీ ట్రీట్ మామూలుగా ఉండదు. తాజాగా దిశా పటానీ షేర్ చేసిన ఫోటో ఒకటి నెటిజన్లకు కునుకు లేకుండా చేస్తోంది. మైకం ఎక్కేసినట్టుగా, మత్తుజల్లేట్టుగా దిశా పెట్టిన పోజు, చేసిన భారీ అందాల విందుకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uEfttI
No comments:
Post a Comment