నాగ చైతన్య విడాకుల వ్యవహారం మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. తామిద్దరం భార్యాభర్తలుగా విడిపోతోన్నామని కానీ, స్నేహితుల్లా కలిసి ఉంటామని సమంత, నాగ చైతన్య పేర్కొన్నారు. విడిపోయేటప్పుడు కూడా ఇద్దరూ ఒకే రకమైన పోస్ట్ చేశారు. అలా సమంత, నాగ చైతన్యలు విడిపోవడం అంతా ఒకెత్తు అయితే.. సిద్దార్థ్, ప్రీతమ్ జుకల్కర్ చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. సిద్దార్థ్ సమంత ప్రేమ కథ గురించి వచ్చిన కథనాలు అందరికీ తెలిసిందే. సమంత తన స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ మధ్య ఉన్న సంబంధం గురించి రకరకాల కథనాలు వచ్చాయి. ఆ మధ్య ప్రీతమ్ ఒళ్లో కాళ్లు పెట్టుకున్న సమంత ఫోటో నెట్టింట్లో ఎంతగా రచ్చగా మారిందో అందరికీ తెలిసిందే. ఆ వెంటనే సమంత ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. సమంత మీద పలుమార్లు ప్రీతమ్ స్పందిస్తూ.. లవ్యూ అని చెప్పేవాడు. అయితే సోదరసోదరి భావంతోనే అన్నట్టుగా కనిపించేది. అయితే తాజాగా సమంత విడాకుల అనంతరం ప్రీతమ్ వేసిన పోస్ట్‌లు వైరల్ కాసాగాయి. అయితే ఆ వెంటనే వాటిని డిలీట్ చేసేశాడు. ఏదో ఒక కంగ్రాట్స్ అంటూ దారుణమైన మాట, బూతు పదాన్ని వాడేశాడు. ఆ పోస్ట్‌ను ప్రీతమ్ వెంటనే డిలీట్ చేశాడు. ఇక మరో పోస్ట్ కూడా ప్రీతమ్ వేశాడు. ‘నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నాసరే అబద్ధాలు, రహస్యాలనేవి అనుబంధాలను తుంచివేస్తాయి’, ‘ప్రజలు నన్ను ఇష్టపడుతున్నారా? లేదా? అనే విషయాన్ని పట్టించుకోను. ఎందుకంటే నేను ఈ భూమ్మీదకు వచ్చింది వాళ్ల మన్ననలు పొందడానికి కాదు. మంచి మనిషిగా ఉండటానికి. అలాగే ఉంటాను’ అంటూ ప్రీతమ్ వేసిన పోస్ట్‌లు అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WFc8xU
No comments:
Post a Comment