Sunday, 3 October 2021

‘మీరిచ్చే ప్రోత్సాహం ఎంతో శక్తి ఇస్తుంది’.. రానాకు ధన్యవాదాలు చెప్పిన ‘ఆకాశవాణి’ దర్శకుడు

ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా అడవిలో జీవనం సాగించే ప్రజల కథను ఆధారంగా చేసుకొని.. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు తెరకెక్కించిన ఆసక్తికర చిత్రం ‘’. ఈ సినిమాలో , వినయ్ వర్మ, తేజ, ప్రశాంత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్‌ను రాజమౌళి విడుదల చేయగా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఈ ట్రైలర్‌లో అడవిలో వారి జీవన విధానం.. వాళ్ల నమ్మకాలు భయాలు, వారిపై అక్కడి దొర చేసే దాడులు, అరాచకాలు ఎలా ఉంటాయో చూపించారు. ఇక అలాంటి గిరిజనులకు సహాయం చేసే పాత్రలో సముద్రఖని మనకు కనిపించారు. అయితే ఈ సినిమా గత నెల 24వ తేదీన ప్రముఖ ఓటీటీ సోని లివ్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ముఖ్యంగా దర్శకుడు సినిమాను ప్రేక్షకులకు చూపించిన విధానంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఈ సినిమాకు స్టార్ హీరో నుంచి ప్రశంసలు వచ్చాయి. ‘మొత్తానికి అశ్విన్ గంగరాజు రూపొందించిన ఆకాశవాణి సినిమాను చూశాను. చాలా కష్టమైన, కఠినమైన కథని.. చాలా సులువుగా.. అద్భుతంగా చూపించారు. ఇలాంటి అద్భుతమైన సినిమాను అందించిన అశ్విన్ మరియు అతని టీమ్‌కు నా అభినందనలు’ అంటూ రానా ట్వీట్ చేశారు. అయితే దీనిపై అశ్విన్‌ స్పందించారు. ‘వావ్.. ఇది చూసి ఆనందంతో గంతులు వేశాను. చాలా థాంక్స్ రానా సార్. ప్రతి సారి మీరు చూపించే ప్రేమ మరియు ప్రోత్సాహం.. నాకు అవధులు లేనంత శక్తిని ఇస్తుంది. అంతేకాక.. నన్ను మరింత కృషి చేసేలా ముందుకు తోస్తుంది. లవ్‌ యూ సార్’ అంటూ అశ్విన్ గంగరాజు ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం రానా ‘విరాట పర్వం’, ‘భీమ్లా నాయక్’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘విరాట పర్వం’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంటే.. ఇక పవన్‌కళ్యాణ్‌తో చేస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l4NfVF

No comments:

Post a Comment

'When I Got The Paatal Lok Demo...'

'...it was for a very, very big lead actor.' from rediff Top Interviews https://ift.tt/hlYgKLd