Wednesday 6 October 2021

RGV: అప్సర రాణి, నైనా గంగూలీ.. హాట్ బ్యూటీల సె*! షాకింగ్ వీడియో వదిలిన రామ్ గోపాల్ వర్మ

డిఫరెంట్ అనే పదానికి మారు పేరు . నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా.. ఏది చేసినా సరే దాంట్లో తన మార్క్ కనిపించాలని తాపత్రయ పడే వ్యక్తుల్లో వర్మదే తొలి స్థానం అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కాస్త కొత్తగా, అంతకుమించి బోల్డ్‌గా ఆలోచించే ఈ వివాదాస్పద వీరుడు.. ఇప్పటికే పలు బోల్డ్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు, అందమైన అమ్మాయిల ఇంటర్వ్యూలతో పిచ్చెక్కించారు. ఇక ఇప్పుడు మరో సెన్సేషనల్ బోల్డ్ మూవీ 'డేంజరస్‌‌'తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. హాట్ బ్యూటీలు , అప్సరా రాణిలను రంగంలోకి దించి ఇండియాలో తొలి లెస్బియన్ మూవీ రూపొందిస్తున్నారు వర్మ. లింగబేధం లేని సె** తెరపై చూపించాలని డిసైడ్ అయిన ఆర్జీవీ.. దీనికి 'డేంజరస్‌‌' అనే పేరు పెట్టి జనాల్లోకి వదులుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సమయంలో బయటకొచ్చిన హాట్ ఫొటోస్, ఫస్ట్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసేయగా.. తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేసి నెట్టింట మంట పుట్టించారు రామ్ గోపాల్ వర్మ. ''ఇది మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమ కథ. స్త్రీ, పురుషుని మధ్య ప్రేమ, లైంగిక వాంఛ ఎలా అయితే ఉంటాయో వీరి మధ్య కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రేమ అనేది ప్రేమ మాత్రమే. దానికి లింగబేధంతో ఎలాంటి సంబంధం లేదు'' అని పేర్కొంటూ ఈ ట్రైలర్ బయటకు వదిలారు. ఇక ఈ షార్ట్ వీడియోలో ఇద్దరు హాట్ బ్యూటీల రొమాంటిక్ సన్నివేశాలను హైలైట్ చేస్తూనే క్రైమ్ సీన్స్ జొప్పించి ఆసక్తి రేకెత్తించారు. కాగా, బికినీల్లో నైనా గంగూలీ, అప్సరా రాణి అందాలను వర్మ స్టైల్‌లో కెమెరాలో బంధించడం ఈ వీడియోలో గమనించవచ్చు. మొత్తానికైతే ఈ వీడియోతో మరోసారి జనం నాలుకపై వర్మ పేరు మారుమోగుతోంది. అదే కదా మరి వర్మ నైజం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3a9J84n

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...