Saturday 9 October 2021

MAA Elections: ‘మా’కు ఇప్పుడు ఎన్నికలు వద్దు.. నిరసనకు దిగిన జూనియర్ ఆర్టిస్ట్ సంఘం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ () ఎన్నికలు ఈ ఏడాది రసవత్తరంగా మారాయి. అధ్యక్షబరిలో విలక్షణ నటుడు .. హీరో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారా.. అనే విషయంపై కూడా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతంది. ఇప్పటికే ఒక వర్గంపై మరో వర్గం మాటల దాడులు చేసుకున్నారు. ఇక కొద్ది రోజుల క్రితమే ఇరు వర్గాల నుంచి మానిఫెస్టోలు కూడా విడుదల అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలకు ఓ సమస్య ఎదురైంది. ఓటరు జాబితాలో ఉన్న బోగస్‌ ఓటర్లను తొలగించిన తర్వాతే ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని జూనియర్‌ ఆర్టిస్ట్‌ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఆదివారం జరిగే మా ఎన్నికల పోలింగ్‌లో 3,609 జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అని.. కానీ అందులో చాలా మంది యూనియన్ సభ్యులు కాని వారు ఉన్నారు అంటూ సంఘం పేర్కొంది. ఇంకొందరు అయితే.. అసలు ఫోన్లు కూడా తీయడం లేదు అని.. వాళ్లు పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వాళ్లు ఫిర్యాదు చేశారు. బైలాస్‌కు విరుద్ధంగా పని చేస్తున్న వల్లభనేని అనిల్‌కుమార్, స్వామిగౌడ్, సినీ పరిశ్రమకు సంబంధం లేని శేషగిరిరావు నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయం తేేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని వాళ్లు పేర్కొన్నారు. ఓటర్ల లిస్టును పూర్తిగా సరి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని వాళ్లు అన్నారు. గత నెలలో జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరుగతాయి అని చెప్పలేదు అని వాళ్లు పేర్కొన్నారు. ఎలాంటి అజెండా లేకుండానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు అని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్ రికార్డులు అడిగిన ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. ఓటరు జాబితా, లెడ్జర్లు, రిసిప్ట్‌ బుక్‌లు, మినిట్స్‌ బుక్‌లు, నెలవారీ ఆదాయ వ్యవహారాలు, అసోసియేట్‌ కార్డు మెంబర్లు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, ఆడిటింగ్‌ వివరాలు ఇవన్నీ తనిఖీ చేసుకునే అవకాశం జూనియర్‌ ఆర్టిస్ట్‌లకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3016Ldy

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...