Saturday 9 October 2021

సమంత పెట్టిన కండీషన్లపై నోరు విప్పిన నీలిమ గుణ.. ప్రీతమ్, సాధన, చిన్మయి స్పందన

నాగ చైతన్య విడాకుల చర్చలు రోజురోజుకూ మలుపులు తిరుగుతూనే ఉంటోంది. ఇప్పుడు నిర్మాత చేసిన కామెంట్లతో కొత్త చర్చలు మొదలయ్యాయి. సమంత తన ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసుకుందని, శాకుంతలం చివరి సినిమా అవుతుందేమోనని కూడా చెప్పిందంటూ నీలిమ గుణ చేసిన కామెంట్లతో ఒక్కసారిగా లెక్కలేనన్ని అనుమానాలు మొదలయ్యాయి. అయితే నీలిమ గుణ ఇలా సమంత గురించి అసలు విషయాలు చెప్పడంతో , సాధన సింగ్, శ్రీపాద సంతోషాన్ని వ్యక్తం చేశారు. శాకుంతలం సినిమా కోసం సమంతను అప్రోచ్ అయ్యాం. కథ విన్న వెంటనే సమంత ఓకే చెప్పేశారు. కానీ కొన్ని కండీషన్లు పెట్టారు. సినిమా త్వరగా పూర్తి చేయాలని జూలై, ఆగస్ట్‌ కెల్లా షూటింగ్ పూర్తి చేసేయాలని సమంత కండీషన్ పెట్టింది. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ప్రయత్నిస్తున్నాను. శాకుంతలం సినిమా చివరది అయ్యేలా ఉంటుంది. ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల సినీ కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని సమంత తెలిపినట్టు నీలిమ గుణ ఓ మీడియాతో మాట్లాడుతూ అన్నీ బయటపెట్టేసింది. అంటే సమంత పిల్లల కోసం ప్రయత్నించింది. కానీ ఆగస్ట్ నెలలోనే ఏదో జరిగింది. అందుకే ఇలా విడాకుల వరకు వ్యవహారం వెళ్లింది. కానీ బయటకు వచ్చిన రూమర్లు మాత్రం సమంతదే తప్పు అన్నట్టుగా వచ్చాయి. అయితే నీలిమ గుణ చేసిన కామెంట్లు, సమంత గురించి చెప్పిన మాటలపై ప్రీతమ్, సాధన సింగ్,చిన్మయి స్పందించారు. ఇలా నోరు విప్పి చెప్పినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆ ముగ్గురూ అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lpEUvR

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...