Saturday 9 October 2021

MAA elections: ‘మా’ ఎన్నికల బైటింగ్‌.. శివ బాలాజీ చెయ్యి కొరికిన హేమ... త‌ల‌వంచుకుని వెళ్లిపోయిన శివ బాలాజీ

ఈ ఆదివారం (అక్టోబర్ 10) రోజున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’ ) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన హేమ గురించి న‌రేశ్ మీడియాతో ఫిర్యాదు చేశారు. త‌మ ప్యానెల్‌కు చెందిన శివ బాలాజీ చేయిని ఆమె కొరికేసింద‌ని చెప్పారు. దీంతో పోలింగ్ ప్రాంగ‌ణంలో ఏమైనా గొడ‌వ‌లు జ‌రిగాయా? అందుకోసమే శివ బాలాజీ చేయిని హేమ కొరికారా? అని చాలా మందికి అనుమానాలు వ‌చ్చాయి.అందుకు త‌గిన‌ట్లుగా శివ బాలాజీ చేయిని చూపించారు న‌రేశ్‌. చేయిపై కొరికిన గాయం క‌నిపిస్తుంది. కానీ.. అలాంటిదేమీ లేద‌ని తెలిసింది. ఎందుకంటే హేమ ఎందుకు మీ చేయిని కొరికారు? ఏమైనా గొడ‌వైందా? అని అడిగితే ఆయ‌న సిగ్గుతో త‌ల వంచుకుని వెళ్లిపోయాడు. ఎన్నిక‌ల ముందు ఒక‌రిక‌పై ఒక‌రు తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఎన్నిక‌ల ముందే ఈ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేసుకుంటుంటే ఎన్నిక‌ల్లో ఎలాంటి విమ‌ర్శ‌లు చేసుకోబోతున్నారో అనే సందేహం అంద‌రికీ క‌లిగింది. అయితే ఎన్నిక‌లు మాత్రం సాఫీగా సాగిపోతున్నాయి. అదే సమయంలో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విష్ణు మంచు, ప్రకాశ్ రాజ్ భుజాలపై చేతులు వేసుకుని వచ్చి మీడియాతో మాట్లాడారు. తామిద్దరం కలిసే ఉన్నామని తెలిపారు. ఎన్నికల వరకే ఇలాంటి ఘటనలుంటాయని, తర్వాత అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. రెండు గంట‌ల్లో 250పైచిలుకు ఓట్లు పోల‌య్యాయ‌ని విష్ణు మంచు తెలిపారు. మ‌రో మూడు నాలుగు గంట‌ల్లో ఈ ఎన్నిక‌లు ముగిస్తాయ‌ని, ఈరోజు రాత్రి 9 త‌ర్వాత ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lrvJer

No comments:

Post a Comment

'Sonia, Kharge, Rahul Have A Chalta Hai Attitude'

'There is some deep rot that has set in the Congress party. This requires an organisational surgery.' from rediff Top Interviews h...