శ్రుతీ హాసన్, శంతను హజారికల వ్యవహారం నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ముంబైలో తన ప్రియుడు శంతనుతో దుమ్ములేపుతోంది. ఈ ఇద్దరూ కలిసి చేసే రచ్చకు అందరూ ఫిదా అవుతుంటారు. వీకెండ్ వస్తే ఈ ఇద్దరూ షాపింగ్ అంటూ హల్చల్ చేస్తుంటారు. గత నెలలో శ్రుతీ హాసన్, శంతను హజారికలు సూపర్ మార్కెట్‌కు వెళ్లి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందరి ముందే ప్రియుడి మీదకు కాలు ఎత్తి.. ముద్దులతో ముంచెత్తింది. అలా సూపర్ మార్కెట్‌లో శ్రుతీ హాసన్ దెబ్బకు అందరూ షాక్ అయ్యారు. ఇక శ్రుతీ హాసన్ షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్, ముంబై అంటూ తిరుగుతూనే ఉంటుంది. సలార్ షూటింగ్ కోసం శ్రుతీ హాసన్ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇక సలార్ షూటింగ్‌లో శ్రుతీ హాసన్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి చేసిన రచ్చ మామూలుగా లేదు. ప్రశాంత్ నీల్‌ను శ్రుతీ హాసన్ దారుణంగా ఆడుకునేది. ఆయన్ను ఎంతగా హింసించేదో శ్రుతీ హాసన్ చెబుతూ ఉండేది. ఇక అలా సలార్ సెట్‌లో ఎంత అల్లరి చేస్తుంటుందో.. ప్రియుడితో అంతకు మించి అనేలా అందరి ముందే రచ్చ చేస్తుంటుంది. ఆ మధ్య ఓసారి ఎయిర్ పోర్ట్‌లో శంతను, శ్రుతీ హాసన్ రొమాన్స్‌కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. అయితే తాజాగా శ్రుతీ హాసన్ ఓ పోస్ట్ చేసింది. సండే రోజు కూడా ఇంటికి కావాల్సిన వస్తువుల కోసం షాపింగ్ చేస్తున్నామంటే.. మనకు 30 ఏళ్లు వచ్చాయని అర్థం అంటూ షాపింగ్ మాల్‌లో అద్దం ముందు దిగిన సెల్ఫీని శ్రుతీ హాసన్ షేర్ చేసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3D8EFLL
No comments:
Post a Comment