Thursday 7 October 2021

విడాకుల తర్వాత సమంత ఫస్ట్ పోస్ట్.. అది కూడా పెళ్లి రోజున! ఆ మాటలతో కన్నీళ్లు పెట్టించిన సామ్

చేసింది పదేళ్ల ప్రయాణం.. ఒక్కటిగా ఉన్నది నాలుగేళ్లు.. ఈ జర్నీలో ఎన్నో తీపి గురుతులు.. మరెన్నో మరపురాని జ్ఞాపకాలు.. ఒక్కటయ్యాక జెట్ రాకెట్‌లా కెరీర్ గ్రాఫ్.. ఇవ్వన్నీ చూస్తుంటే గుర్తొచ్చేది సమంత- నాగ చైతన్య జోడీ మాత్రమే. టాలీవుడ్ మోస్ట్ టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్‌గా ఫుల్ పాపులారిటీ అయింది ఈ జోడీ. కానీ విధిరాత అనుకోవాలో లేక వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలో తెలియదు గానీ నాలుగేళ్ల ఈ వివాహ బంధానికి ఉన్నట్టుండి బ్రేక్ పడింది. స్టార్ హీరోయిన్‌గా అక్కినేని వారింట అడుగుపెట్టిన .. ఆ ట్యాగ్ చెరిపేసుకుంది. నాగ చైతన్యతో ఇక భార్యగా కాకుండా స్నేహితురాలిగా మాత్రమే ఉంటానని ప్రకటించేసింది. మరోవైపు నాగ చైతన్య కూడా సరిగ్గా ఇదే సందేశం ఇచ్చి అక్కినేని అభిమానులను హర్ట్ చేసేశాడు. ఎంతో అన్యోన్యంగా, అంతకుమించి చూడముచ్చటగా ఉండే చై- సామ్ జోడీ కట్ కావడం ఎందరో అభిమానుల గుండెలను గుచ్చేసింది. ఎవ్వరేమనుకున్నా.. లోలోపల ఏది జరిగినా.. చివరకు మాత్రం సమంత- నాగ చైతన్య తిరిగి ఒంటరి జీవితంలోకి ఎంటరయ్యారు. ఈ నేపథ్యంలో విడాకుల ప్రకటన అనంతరం తొలి పోస్ట్ చేసి అభిమానులను బాధతో పలకరించింది సామ్. అది కూడా తన పెళ్లి రోజున (అక్టోబర్ 7) ఈ పోస్ట్ పెట్టడంతో గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్. ''పాత ప్రేమ పాటలు- పర్వతాలు, శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని. కొన్ని పొగొట్టుకున్న పాత చిత్రాల పాటలు దొరికినప్పుడు. లోలోపలి బాధను ప్రతి ధ్వనించే ఆ ప్రేమ పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు. ఆ సందులలో గాలి శబ్దం'' అంటూ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టింది సామ్. ఈ మేరకు షేర్ చేసిన ఫొటోలో తెల్లని డ్రెస్ ధరించి ఒంటరిగా, తీక్షణంగా నేలవైపు చూస్తూ కనిపిస్తోంది సమంత.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3AhFZtV

No comments:

Post a Comment

'Rekha And I Didn't Speak To Each Other For 20 Years'

'Rekha and my wife were close friends, and my so-called cold war with Rekha was causing difficulties in my wife's friendship with he...