బోల్డ్ స్టెప్స్ వేయడం మాత్రమే కాదండోయ్ ఎప్పటికప్పుడు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండటంలో ఎప్పుడూ ముందుంటారు , . ఎదుటివారిపై దాడికి దిగితే ఈ ఇద్దరి తీరు ఎలా ఉంటుందనేది ఇప్పటికే చాలా సార్లు చూశాం కూడా. మరి ఈ ఇద్దరి మధ్యే వార్ నెలకొంటే..? ఆ పరిస్థితి ఊహించగలమా. తాజా పరిస్థితులు చూస్తుంటే సరిగ్గా అదే జరుగుతుందేమో అనిపిస్తోంది. ఏపీ సినిమా టికెట్ ధరల ఇష్యూపై రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కామెంట్స్, జగన్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడుతున్న తీరు శ్రీ రెడ్డికి ఏ మాత్రం మింగుడుపడటం లేదు. దీంతో ఇంకేముంది సీన్ లోకి వచ్చేసింది ఈ సంచలన తార. తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ దుమ్ముదులిపేసింది. పనీపాట లేని వ్యక్తి ఆర్జీవీ అంటూ అన్నీ ఓపెన్‌గా మాట్లాడేసింది. ''పైకి వేదాంతిలా కనిపించినా ఆయన గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకునే టైపు ఆయన. అస్సలు తట్టుకోలేని మనిషి. పెద్ద మనిషిలా ఉంటూ తనేం పట్టించుకోను అంటాడు గానీ ప్రతి రోజు తన గురించి వార్తా విశేషాలు పోగు చేసుకుంటూ ఉంటాడు. ఏ రోజైనా తన గురించి వార్త రాలేదంటే చాలా అన్ హ్యాప్పీగా ఫీల్ అవుతాడు. వార్త క్రియేట్ చేయడానికి వెంటనే సన్నాయత్తం అవుతాడు. నీకు అంతకుముందు నేను దొరికాను. సురేష్ బాబు పంచన చేరి చాలా ప్రయత్నించి సఫలం అయ్యావు. ఈ రోజు నీకు థియేటర్స్ ప్రాబ్లమ్స్ కావాల్సి వచ్చింది. ఎందులో అయినా దూరిపోయి సర్వనాశం చేసే ఒక వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే అది కేవలం రామ్ గోపాల్ వర్మ. బాలీవుడ్‌లో 'చి తూ' అంటే తట్టాబుట్టా సర్దేసుకొని హైదరాబాద్ ఊపుకుంటూ వచ్చేశాడు. కాంట్రవర్సీలు సృష్టిస్తూ ఒక ముగ్గురు నలుగురు తొత్తులను పెట్టుకొని నేనున్నా అంటూ అన్నింటిలో దూరిపోతుంటాడు. పోనీ సంఘానికేమైనా మంచి పనులు చేస్తాడా అంటే ఈయన చేసే పనులు బ్లూ ఫిలిమ్స్ తీయడం. బీ గ్రేడ్, సి గ్రేడ్ అమ్మాయిలను కుర్చోబెట్టుకొని వాళ్ల తొడల గురించి, పార్ట్స్ గురించి కామెంట్స్ చేస్తూ స్త్రీ జాతిని కించపరిచేలా మాట్లాడటం. అమ్మాయి అంటే దానికి మాత్రమే. అమ్మాయి కాళ్ళ సందుల గురించి.. ఇదీ ఆయన తీరు. నువ్వు ఏ కొండలైనా నమ్ముకో, ఏ గుట్టలనైనా నమ్ముకో కానీ జగన్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టకు. జగన్ గారిని ఏమన్నా అనాలంటే నన్ను దాటుకొని వెళ్లాలని గుర్తు పెట్టుకో'' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pYNFPM
No comments:
Post a Comment