మెగాస్టార్ , మెగా పవర్ స్టార్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాతలు మరోసారి ప్రకటించారు. ఉగాది సందర్భంగా చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటైర్‌టైన్‌మెంట్ ప్రకటించాయి. అంతా బాగానే ఉందని అనుకుంటున్న తరుణంలో కోవిడ్ ప్రభావం పెరుగుతూ రావడంతో థియేటర్స్ పలు రాష్ట్రాల్లో మూసి వేయడం.. లేదా 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడం చేస్తున్నారు. దీంతో భారీ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలుగా విడుదలకు సిద్ధమైన RRR, రాధే శ్యామ్ వాయిదా పడ్డాయి. ఇంకా పరిస్థితులు కంట్రోల్‌లోకి రాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి తర్వాత త్వరలోనే నైట్ కర్ఫ్యూ, 50 శాతం ఆక్యుపెన్సీని ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. దీంతో థియేటర్స్ సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో ఆచార్య సినిమాను ఫిబ్రవరి 4న వాయిదా వేసి ఏప్రిల్ 1కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఆచార్య’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మహేష్ అభిమానుల్లో కొత్త అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే మహేష్ సరికొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ మూవీ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. మరిప్పుడు అదే రోజున చిరంజీవి ఆచార్య రానుంది. అంటే ఉగాది సందర్భంగా ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ పోటీ పడుతున్నారా? లేక సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల మేరకు ‘సర్కారు వారి పాట’ చిత్రం వాయిదా పడిందా? అనేది తెలియడం లేదు. ఉగాది పండగ కావడం.. ఇప్పటికే వాయిదాలు మీద వాయిదాలు పడటం అనే కారణాలతో ఆచార్య, సర్కారు వారి పాట చిత్రాలు ఒకే రోజున రాబోతున్నాయా? అనే దానిపై మేకర్స్ నుంచి ఎటువంటి క్లారిటీ మాత్రం లేదు. ఒక వేళ ఇద్దరి సినిమాలు విడుదలైతే.. చిరంజీవి, మమేష్ పోటీ అనేది ఆసక్తికరమైన విషయంగానే చెప్పొచ్చు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A1jqeC
No comments:
Post a Comment