Wednesday, 19 January 2022

వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారు.. ధనుష్ తండ్రి రియాక్షన్

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు, అల్లుడు ఐశ్వర్య రజినీకాంత్- తమ 18 ఏళ్ల త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి పలికిన సంగతి తెలిసిందే. ఇంతటితో తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు ఐశ్వర్య, ధనుష్ తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా వెల్లడించి సినీ లోకాన్ని ఆశ్చర్యపరిచారు. దీంతో ఐశ్వర్య- ధనుష్ డివోర్స్ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది. ఈ డివోర్స్‌కి కారణాలేంటి? ఇన్నేళ్ల తర్వాత ఎందుకు విడిపోతున్నారనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ తండ్రి రియాక్ట్ అయ్యారు. ఓ కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ధనుష్- ఐశ్వర్యల బ్రేకప్‌పై స్పందించిన కస్తూరి రాజా.. వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సాధారణమైన విషయం. అలాంటి మనస్పర్థలే ధనుష్, ఐశ్వర్య మధ్య చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. విడాకుల విషయమై ఇద్దరితో ఫోన్‌లో మాట్లాడి కొన్ని సలహాలు, సూచనలిచ్చా. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా విడాకుల నిర్ణయంపై మరోసారి ఆలోచించమని వారిద్దరిని కోరారు. మరోవైపు పిల్లల భవిష్యత్తు కోసం విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు కోరుతున్నారని కస్తూరి రాజా అన్నారు. ర‌జినీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య 2004 న‌వంబ‌ర్ 18న పెద్దల సమక్షంలో ధనుష్‌ని పెళ్లాడింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్‌ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాగే ఓ నటితో సన్నిహితంగా ఉంటున్నారని, అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయంటూ ఈ విడాకుల ఇష్యూపై రకరకాల రూమర్స్ చెక్కర్లు కొడుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/358wrHR

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd