Friday, 21 January 2022

ముంబైలో పూజా హెగ్డే ల‌గ్జ‌రీ హౌస్‌ .. గృహ ప్రవేశం చేసిన బ్యూటీ

కర్ణాటకకు చెందిన తుళు బ్యూటీ కల నేరవేరింది. ఈ విషయాన్ని ఆమె వివ‌రిస్తూ ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క‌ల‌ను నేర‌వేర్చుకోవ‌డం కోసం ఏడాదిగా ఆమె మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డుతున్నార‌ట‌. ఇంత‌కీ ఈ అమ్మ‌డి క‌ల ఏంటి? అనే విష‌యాల్లోకి వెళితే, ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిన కూడా వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా ఉంటున్న పూజా హెగ్డేకి ముంబైలో సొంతంగా ఓ ఇంటికి నిర్మించుకోవాల‌నేది క‌ల‌. కానీ ముంబైలో ఇంటిని నిర్మించుకోవ‌డం అంటే ఎంత ఖ‌ర్చుతో కూడిన వ్య‌వ‌హార‌మో తెలుసుగా.. కోట్ల రూపాయ‌లు కావాలి. అయితే అప్పుడ‌ప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న పూజా హెగ్డే మాత్రం ఎప్ప‌టికైనా త‌న క‌ల‌ను నేర‌వేర్చుకోవాల‌ని బ‌లంగా కోరుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకునే రేంజ్‌కు ఎదిగిన ఈమె ముంబైలో స్థ‌లం కొని ఇంటిని నిర్మించుకుంది. ఏడాదిగా ఆ ఇంటి నిర్మాణ ప‌నుల‌ను కూడా ఆమె ప‌ర్య‌వేక్షిస్తుంద‌ట‌. ఎట్ట‌కేల‌కు ఆ ప‌నుల‌న్నీ పూర్త‌య్యాయి. ఆ ఇంటిలోకి గృహ ప్ర‌వేశం కూడా చేసింది. ఆ ఫొటోల‌ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే పూజా హెగ్డే తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో అగ్ర క‌థానాయ‌కులందరితోనూ సినిమాలు చేస్తుంది. పాన్ ఇండియా రేంజ్ మూవీస్‌తోనూ ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మైంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈమె ప్ర‌భాస్‌తో న‌టించిన రాధే శ్యామ్ విడుద‌ల కావాల్సింది. కానీ.. కోవిడ్ ప్ర‌భావంతో వాయిదా ప‌డింది. అలాగే ఆచార్య సినిమాలో రామ్ చ‌ర‌ణ్ జోడీగా న‌టించింది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల కావాల్సింది. ఏప్రిల్ 1కి వాయిదా ప‌డింది. ఇక త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడైన విజ‌య్ న‌టిస్తోన్న బీస్ట్‌లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్‌. ఇక హిందీలో స‌ర్క‌స్ సినిమాలో న‌టించింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FRUXd5

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...