Sunday, 30 January 2022

డిజిట‌ల్ ఎంట్రీకి ర‌కుల్ ప్రీత్ సింగ్ రెడీ.. కానీ కండీష‌న్ ఏంటంటే?

మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఇప్పుడు మ‌న స్టార్స్ డిజిట‌ల్ ఎంట్రీ ఇస్తున్నారు. హీరోలు, హీరోయిన్సే కాదు.. స్టార్ టెక్నీషియ‌న్స్‌, నిర్మాణ సంస్థ‌లు అన్నీ డిజిటల్ వైపుకు చూస్తున్నారు. ద‌క్షిణాదిన అగ్ర హీరోయిన్స్ సైతం ఓటీటీల‌కు ఓటేస్తున్నారు. ఇప్ప‌టికే స‌మంత‌, త‌మ‌న్నా వంటి వారు ఓటీటీల్లో అడుగు పెట్టేశారు. వెబ్ సిరీస్‌లు, టాక్‌షోలు, వంట‌ల ప్రోగ్రామ్స్ చేసి అంద‌రినీ అల‌రించేశారు. ఇప్పుడు వీరి బాట‌లోకి మ‌రో ముద్దుగుమ్మ కూడా అడుగు పెట్టేయ‌డానికి రెడీ అంటోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో తెలుసా? ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ‘‘ఇంట్రెస్టింగ్‌గా ఉండే కంటెంట్‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఓటీటీల‌కు ప్ర‌జ‌ల్లో ప్రాధాన్య‌త పెరుగుతుంది. ముఖ్యంగా ఓటీటీల కార‌ణంగా రీజ‌న‌ల్ సినిమాలు, కంటెంట్ అనేది ఎక్కువ మందికి చేరువ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. బాహుబ‌లి సినిమా వ‌ల్ల పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మ‌న ద‌గ్గ‌ర సినిమాల ప‌రంగా భాషా ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉండ‌టం లేదు. కంటెంట్ బావుంటే చాలు. అంద‌రూ చూస్తున్నారు. డిజిట‌ల్ కంటెంట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. నేను కూడా డిజిట‌ల్ మాధ్య‌మంలో న‌టించానికి రెడీ. అయితే నా పాత్ర ప్ర‌ధానంగా ఉండాలి. క‌థ‌ను న‌డిపించాలి. కంటెంట్ ఆస‌క్తిక‌రంగా, ఎగ్జయిటింగ్‌గా ఉండాలి’’ అన్నారు ర‌కుల్ ప్రీత్ సింగ్‌. మ‌రి ర‌కుల్‌కి డిజిట‌ల్ ఎంట్రీకి ఏ నిర్మాత అవ‌కాశం ఇస్తారో చూడాలి మ‌రి. ద‌క్షిణాదిన ఇటు తెలుగు, అటు త‌మిళంతో పాటు బాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ప్ర‌స్తుతం ఈమెకు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తోనే బిజీగా ఉంటుంది. సినిమాలు కాకుండా ఎఫ్ 45 అనే జిమ్స్ నిర్వ‌హ‌ణ‌తో ఈ ఫిట్ నెస్ ఫ్రీక్ బిజీగా ఉంటుంద‌నే సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం బాలీవుడ్ న‌టుడు జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉంది. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌కుల్‌, జాకీ భ‌గ్నానీ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నారు. తెలుగులో కెరటం సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్, అతి కొద్ది కాలంలోనే అగ్ర హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. నాగార్జున‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్, నాగ చైత‌న్య‌ చూద్దాం వంటి స్టార్స్‌తో ఈమె న‌టించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/mu4b1ZkDx

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk