Saturday, 22 January 2022

అది దాచినా దాగదు : శ్రుతి హాసన్

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రుతి హాసన్‌కు మొదటి విజయాన్ని అందించింది మాత్రం తెలుగు ప్రేక్షకులే. ఆమెను నెత్తిన పెట్టుకుంది కూడా టాలీవుడ్డే. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చినా కూడా తెలుగులో లక్కీ హ్యాండ్‌గా మారింది. గబ్బర్ సింగ్ రూపంలో ఆమె తన మొదటి విజయాన్ని రుచి చూసింది. అలా శ్రుతి హాసన్‌కు టాలీవుడ్ కలిసి వచ్చింది. జనవరి 28న శ్రుతి హాసన్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను చెప్పుకొచ్చింది. సెవెన్త్ సెన్స్ సినిమా చేసిన సమయంలోనే తన మీద తనకు నటించగలను అని నమ్మకం ఏర్పడిందట. మురుగదాస్ ఇచ్చిన ధైర్యం, నమ్మకంతోనే ఆ పాత్రను పోషించానని తెలిపింది. ఈ పాత్రను చేయగలనా? అని భయపడుతుంటే.. నేను నిన్ను నమ్ముతున్నాను నీ మీద నీకు నమ్మకం లేదా? అని మురుగుదాస్ అన్నారట. అయితే తనను మొదట స్వీకరించింది మాత్రం తెలుగు ప్రేక్షకులేనని, తొలి విజయం దక్కింది కూడా ఇక్కడేనని తెలిపింది. అందుకే ఎన్ని భాషల్లో నటిస్తున్నా కూడా తెలుగులో నటించడం అంటే ప్రత్యేకంగా భావిస్తానని పేర్కొంది. ఇక సీనియర్లైన బాలయ్య, చిరు సినిమాల్లో నటించడంపైనా స్పందించింది. సీనియర్లు, యువ హీరోలు అనేవి లెక్కలేవీ వేసుకోనని, కథ, పాత్రలు నచ్చితే చేస్తానని అంది. దాదాపు 13 ఏళ్ల ప్రయాణం తరువాత కూడా అలాంటి అలోచనలు ఉంటే కుదరదు అని చెప్పుకొచ్చింది. ఇక తన వయసు గురించి చెబుతూ.. అది దాచినా దాగదని, వయసుకు తగ్గట్టు మనుషులు మారుతుంటారని తెలిపింది. శారీరకంగా నాలోనూ పెద్ద ఎత్తున మార్పులు వచ్చినా తానేమీ ఫీల్ అయ్యేదాన్ని కాదని పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3H9uuct

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd