Saturday, 29 January 2022

రామ్ చరణ్ వెంట ముంబైకి శ్రీజ.. క్లిష్ట పరిస్థితుల్లో అన్నయ్య సాయం?

గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. చిరు కూతురు మరోసారి విడాకుల బాట పట్టిందని వార్తలు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితుల నడుమ తాజాగా చెల్లెలు శ్రీజను వెంట బెట్టుకొని ముంబై విమానాశ్రయంలో కనిపించడంతో మెగా శిభిరంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అచ్చం సమంత లాగే శ్రీజ కూడా తన సోషల్ మీడియా ఖాతా నుంచి భర్త పేరును తొలగించి తనపై వస్తున్న రూమర్లకు రెక్కలు కట్టింది. విడాకుల రూమర్స్ షికారు చేస్తుండగానే శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సంబంధించిన పేరును మార్చడంతో అందరిలో డౌట్స్ రెట్టింపయ్యాయి. క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా క‌ళ్యాణ్‌గా మార్చుకున్న ఆమె.. రీసెంట్‌గా ఆ పేరును శ్రీజా కొణిదెల‌గా మార్చేసింది. మరోవైపు శ్రీజ- కళ్యాణ్ దేవ్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు వచ్చాయని, గతేడాది ఆగస్టు నెలలోనే వాళ్లిద్దరూ విడిపోయారనే టాక్ ముదిరింది. పైగా కళ్యణ్ దేవ్ హీరోగా రూపొందిన 'సూపర్ మచ్చి' సినిమాను ప్రమోషన్స్‌లో మెగా ఫ్యామిలీ కనిపించకపోవడం, అలాగే రీసెంట్‌గా జరిగిన మెగా ఫ్యామిలీ మీట్స్‌కి కళ్యాణ్ దేవ్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క ఇదంతా నడుస్తున్నా మెగా ఫ్యామిలీ మౌనం వహించడం కూడా జనాల్లో ఉన్న అనుమానాలకు రెక్కలు కట్టింది. ఇంతలో సోదరుడు రామ్ చరణ్‌తో ముంబై విమానాశ్రయంలో శ్రీజ కనిపించడంతో ఆ వీడియో వైరల్ కావడమే గాక ఇంతకీ మెగా శిభిరంలో ఏం జరుగుతోంది? అనే చర్చలు ఊపందుకున్నాయి. తన విడాకుల విషయంపై వస్తున్న వార్తల నేపథ్యంలో శ్రీజ వ్యక్తిగతంగా చాలా డిప్రెషన్‌కి వెళ్లిపోయిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రామ్ చరణ్ తన సోదరి పట్ల స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే తనతో పాటే షూటింగ్ లొకేషన్స్ తిప్పుతూ ఆమె మనసు ప్రశాంతంగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చలు నడుస్తున్నాయి. శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడాకుల విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ తాజా పరిస్థితులు చూసి జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మొదట 2007 సంవత్సరంలో శిరీష్ భ‌ర‌ద్వాజ్‌ అనే వ్యక్తిని ఆర్య స‌మాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ.. అతనితో 2014లో విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత 2016 సంవత్సరంలో క‌ళ్యాణ్ దేవ్‌‌ని పెళ్లాడింది. వీరికి నవిష్క ఓ పాప కూడా పుట్టింది. శ్రీజను పెళ్లి చేసుకొని మెగా కాంపౌండ్‌లో అడుగుపెట్టాక హీరోగా 'విజేత' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు కళ్యాణ్ దేవ్. సో.. చూడాలి మరి శ్రీజ- కళ్యాణ్ దేవ్ విడాకుల వ్యవహారంపై వస్తున్న వార్తలకు ఎలాంటి ముగింపు లభిస్తుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rX6apVKti

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....