కెమెరా ముందు తొడగొట్టి ప్రేక్షకుల చేత ఈలలు వేయించడమే కాదండోయ్.. వేదిక ఎక్కితే పద్యాలతో ప్రతి ఒక్కరి చూపు తనమీదే పడేలా చేసుకోవడం నందమూరి నటసింహం బాలకృష్ణ నైజం. ఈ రెండు విద్యల్లో ఎంతో ప్రావీణ్యం ఉన్న ఆయన ఇటీవలి కాలంలో ఆన్ లైన్ తెరలను షేక్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అంటూ ఆహా వేదికపై అబ్బురపరుస్తున్నారు బాలయ్యబాబు. హోస్ట్ చేయడంలో కూడా తనది ప్రత్యేకమైన స్టైల్ అని ఈ షోతో ప్రూవ్ చేసుకున్న బాలకృష్ణ.. తాజా ఎపిసోడ్‌లో మద్యంపై పద్యం పాడి ఆశ్చర్యపరిచారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'పైసా వసూల్' సినిమాలో 'మామా ఎక్ పెగ్‌లా' అని పాడేస్తూ మద్యం ప్రియులను అట్రాక్ట్ చేసిన బాలకృష్ణ.. తాజాగా పద్యం రూపంలో మరోసారి అలాంటి మ్యాజికే చేశారు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో మాట మంతీ జరిపిన ఆయన, మద్యంపై పద్యం పాడేసి అందరినీ తెగ నవ్వించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ని ఓ వ్యక్తి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో సదరు వీడియో వైరల్ అవుతోంది. సంక్రాంతి స్పెషల్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌లో 'లైగర్' టీమ్ సందడి చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముగ్గురూ కలిసి బాలయ్య బాబు ముచ్చట్లతో ఎంజాయ్ చేశారు. లైగర్ సినిమా విషయాలు, షూటింగ్ సంగతులతో పాటు తమ తమ వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయ్యారు. అయితే మధ్య మధ్యలో తనదైన స్టైల్ మసాలా దట్టిస్తూ రక్తి కట్టించిన హోస్ట్ బాలకృష్ణ.. ఇలా మద్యంపై పద్యం వేసుకొని అట్రాక్ట్ చేశారు. గుక్కతిప్పుకోకుండా, తడబడకుండా నటసింహం పాడిన ఈ పద్యం మందు బాబులతో పాటు సాధారణ ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rqiWe8
No comments:
Post a Comment