Wednesday, 19 January 2022

నిధి కోసం మళ్లీ హీరో కావాలనుంది.. జగపతి బాబు కామెంట్స్ వైరల్

'మున్నా మైఖేల్' అనే బాలీవుడ్ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన .. ఆ తర్వాత 'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 'ఇస్మార్ట్ శంకర్‌' మూవీతో భారీ క్రేజ్ సంపాదించింది. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకొని వరుస ఆఫర్స్ పట్టేస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా కొత్త హీరో అశోక్ గల్లాతో 'హీరో' సినిమా చేసి పలువురు ప్రశంసలందుకుంటోంది. ఈ మూవీలో నిధి గ్లామర్ షో స్పెషల్ అట్రాక్షన్ అయింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్, ప్రమోషన్ కార్యక్రమాల్లో పలువురు సినీ ప్రముఖులు నిధి అగర్వాల్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన హీరో థాంక్స్ మీట్‌లో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌పై సీనియర్ హీరో చేసిన కామెంట్స్, అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. నిధి కోసం తనకు మళ్లీ హీరో కావాలనే కోరిక పుట్టిందంటూ అందరి ముందే ఓపెన్ అయ్యారు జగపతి బాబు. అంతేకాదు నిధి అందాన్ని తెగ పొగిడేస్తూ మాట్లాడిన ఆయన.. థియేటర్లలో నిధి అగర్వాల్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పారు. ఇక మరో సీనియర్ నటుడు నరేష్ కూడా నిధి అగర్వాల్ క్రేజ్ చూస్తుంటే తనకు మరో జన్మలో ఆమెలా పుట్టాలని ఉందని చెప్పడం గమనార్హం. నిధి అంటే సంపద అని, ఆమె నటించిన ప్రతి సినిమా నిర్మాతలకు లాభాల పంట పండిస్తోందని బ్రహ్మాజీ పొగిడేశారు. ఇలా సీనియర్ నటుల పొగడ్తలు విని సంతోషంతో ఉక్కిరి బిక్కిరయింది నిధి అగర్వాల్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన 'హరి హర వీరమల్లు' సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఫ్యూచర్‌లో విలక్షణ పాత్రలతో అలరిస్తానని అంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rD0QFX

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....