మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ కన్నడ, మలయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఎందుకనో ఆమె తెలుగులో మాత్రం కనిపించడం లేదు. మరి తెలుగులో అవకాశాలు రావడం లేదో, లేక వచ్చినా చేయడం లేదో తెలియడం లేదు. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు తెగ యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ షో చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా అనేంతగా హాటు అందాలతో ఈమె సోషల్ మీడియాలో కుర్ర కారుని రెచ్చగొడుతుంది. ఇప్పుడు మాళవికా మోహనన్ మాల్దీవుల్లో విహార యాత్ర చేస్తూ బిజీగా ఉంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే రీసెంట్‌గా ఆమె స్విమ్ సూట్ వేసుకుని నాభి అందాలను ప్రదర్శిస్తూ షేర్ చేసిన కొన్ని ఫొటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 2013లో పట్టం పోలే అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది మాళవికా మోహనన్. తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసకుని నిర్ణయాకం అనే మరో మలయాళ సినిమాలో యాక్ట్ చేసింది. తదుపరి నాను మట్టు వరలక్ష్మి అనే కన్నడ సినిమాలో సందడి చేసింది. తమిళంలో రజనీకాంత్ హీరోగా చేసిన పేట, దళపతి విజయ్ హీరోగా చేసిన మాస్టర్ చిత్రాల్లో నటించింది. ధనుష్‌తో చేసిన మారన్ మూవీ విడుదల కావాల్సి ఉంది. ఇక బాలీవుడ్‌లో బియాండ్ ది క్లౌడ్స్, యుద్ర సినిమాల్లో నటించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/AhTWaowek
No comments:
Post a Comment