Sunday, 23 January 2022

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వారు నిర్మాత‌లుగా చేస్తున్న 50వ చిత్ర‌మిది. ఈ సినిమాలో సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గానూ.. చీఫ్ మినిస్ట‌ర్ పాత్ర‌లోనూ క‌నిపిస్తార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు సీనియ‌ర్ న‌టుడు RC 15లో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో ఆయ‌నే చెప్పుకొచ్చారు. RC 15లో నా పాత్ర‌ను చూసి ఇదేంటి ఇది మ‌న శ్రీకాంతేనా? అని అంద‌రూ అనుకునేంత‌లా నా పాత్ర‌ను శంక‌ర్‌గారు చూపించ‌బోతున్నారంటూ శ్రీకాంత్ తెలిపారు. అంటే శ్రీకాంత్ పాత్ర నెగ‌టివ్ ట‌చ్‌తో సాగుతుందా? లేక పాజిటివ్ ట‌చ్‌తో సాగుతుందా? అనేది మాత్రం తెలియ‌డం లేదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ చేసిన భారీ పాన్ ఇండియా మూవీ RRR. ఈ సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కార‌ణంగా వాయిదా పడింది. దీంతో ఇప్ప‌డు RRR చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. అలాగే తండ్రి చిరంజీవితో క‌లిసి న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. ఆచార్య‌, RRR సినిమాల‌కు సంబంధించిన వ‌ర్క్ అంతా పూర్త‌వ‌డంతో ఇప్పుడు చ‌ర‌ణ్ త‌న RC 15 ఫోక‌స్ చేశారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ రెడీ అయిపోతున్నారు. ఆ విష‌యాన్ని వాళ్లు చెప్పేశారు కూడా. త‌దుప‌రి చ‌ర‌ణ్ త‌న 16వ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో గౌత‌మ్ తిన్న‌నూరితో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇలా మెగా ప‌వ‌ర్ స్టార్ త‌న సినిమాల‌న్నంటినీ పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేసుకుంటూ వ‌స్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qTjqKx

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...