Sunday, 23 January 2022

Nani : ‘అంటే సుందరానికీ’ షూటింగ్ పూర్తి.. నానికి మరో హిట్ దక్కేనా?

నేచుర‌ల్ స్టార్ హీరోగా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎంటర్‌టైన‌ర్ ‘అంటే..సుంద‌రానికీ!’. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని నాని ఓ చిన్న వీడియో ద్వారా తెలియ‌జేస్తూ స‌ద‌రు వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ ఇక సినిమా షూటింగ్ పూర్త‌య్యింద‌ని చెప్ప‌డంతో యూనిట్ అంతా సంతోషంతో కేరింత‌లు కొట్టారు. నాని త‌న టీమ్‌తో క‌లిసి అంటే సుంద‌రానికీ అంటూ గోల చేశారు. వారితో సెల్ఫీ దిగారు. ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను మాత్రం పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి సిద్ధం చేస్తున్నారు నిర్మాత‌లు. నానికి సంబంధించి లుక్‌, జీరోత్ లుక్ అంటూ విడుద‌ల చేసిన ప్రోమోల‌ను గ‌మ‌నిస్తే ఆయ‌న ఇందులో బ్రాహ్మ‌ణ అబ్బాయిగా క‌నిపించ‌బోతున్నార‌నే సంగ‌తి తెలుస్తుంది. ప్రేమ కోసం నాని అమెరికా వెళ‌తార‌ని, అక్క‌డే మ‌న వాడు ప‌డే ఇబ్బంద‌లు అన్నీ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటాయ‌ని స‌మాచారం. మెంట‌ల్ మ‌దిలో, బ్రోచెవారెవ‌రురా సినిమాలో స‌క్సెస్‌ల‌ను అందుకున్న డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్ ‘అంటే.. సుంద‌రానికీ!’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నారు. ఇంకా న‌దియా, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, సుహాస్‌, రాహుల్ రామ‌కృష్ణ త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. గ‌త ఏడాది చివ‌ర‌లో శ్యామ్ సింగ‌రాయ్ సినిమాతో నాని హిట్ కొట్టారు. అదే స్పీడుని కంటిన్యూ చేస్తూ నాని ఈ సినిమాతో మ‌రో హిట్ సాధిస్తార‌ని ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక నాని త‌న త‌దుప‌రి చిత్రం ‘ద‌స‌రా’ చిత్రీక‌ర‌ణ‌లో బిజీ కానున్నారు. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మూవీ. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు రోష‌న్ మాథ్యూ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌నున్నారు. సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా సంతోష్ నారాయ‌ణ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో నాని ప‌క్కా మాస్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. గుబురు గ‌డ్డంతో నాని ఉన్న లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేస్తే దానికి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే నాని పాత్ర గ్రే షేడ్‌లో సాగుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nTDWsO

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...