Thursday, 20 January 2022

విడాకుల అనౌన్స్‌మెంట్ నోట్‌ను డిలీట్ చేసిన స‌మంత‌.. చై, సామ్ మళ్లీ కలుస్తున్నారా !

టాలీవుడ్‌లో మోస్ట్ క్యూటెస్ట్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్న నాగ చైత‌న్య, స‌మంత‌ల‌ను చూసి వారి ఫ్యాన్స్‌, ఫాలోవ‌ర్స్ ఎంత‌గానో మురిసిపోయేవారు. అయితే అది గ‌త ఏడాది అక్టోబ‌ర్ 1 వ‌ర‌కు మాత్ర‌మే. అక్టోబ‌ర్ 2న చైతు, సామ్ విడిపోతున్న‌ట్లు వారి వారి అధికారిక సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచారు. ఇది వారిని ప్రేమిస్తున్న‌, అభిమానిస్తున్న వారికే కాదు, వారి స్నేహితుల‌కు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు కూడా షాకింగ్‌గా అనిపించింది. కొన్ని రోజుల వ‌ర‌కు ఇద్ద‌రు ఫోన్స్‌కు కూడా దొర‌క్కుండా ఉండిపోయారు. ఇప్పుడు క్ర‌మంగా ఎవ‌రి లైఫ్‌లు వారు లీడ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. అయితే రీసెంట్‌గా స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి విడాకుల ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ నోట్‌ను డిలీట్ చేశారు. దీంతో అంద‌రూ అస‌లు స‌మంత అలా ఎందుకు చేసిందంటూ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. వీళ్లిద్ద‌రూ మ‌ళ్లీ ఏమైనా క‌లుసుకునే ఆలోచ‌న‌లో ఉన్నారా? అందుకే స‌మంత అలా చేసిందా? ఇలాంటి ఆలోచ‌న‌లు కూడా రాక మాన‌వు. అయితే నాగ‌చైత‌న్య ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం డివోర్స్ స్టేట్‌మెంట్ క‌నిపిస్తుంది. ఒక‌వేళ ఇద్ద‌రూ క‌లిసి పోవాల‌నుకుంటే చైత‌న్య కూడా డిలీట్ స‌ద‌రు స్టేట్‌మెంట్‌ను డిలీట్ చేయాలిగా.. కానీ అలా జ‌ర‌గ‌లేదు. స‌మంత ఇన్‌స్టాలో స్టేట్‌మెంట్ మాత్రం డిలీట్ అయ్యింది. ఇక్కడ అస‌లు విష‌య‌మేమంటే.. స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌ను క్లీన్ చేసే ప్రాసెస్‌లో విడాకుల ప్ర‌క‌ట‌న నోట్‌ను డిలీట్ చేశార‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే రీసెంట్‌గా బంగార్రాజు సినిమాతో నాగ చైత‌న్య భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించారు. దీని త‌ర్వాత ఈయ‌న న‌టించిన థాంక్యూ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌తో క‌లిసి లాల్ సింగ్ చ‌ద్దా సినిమాలో న‌టించారు. త్వ‌ర‌లోనే ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌లోనూ నాగ చైత‌న్య న‌టించ‌బోతున్నారు. స‌మంత విషయాన్ని చూస్తే.. ఆమె తొలిసారి పుష్ప ది రైజ్ సినిమా కోసం ఐటెమ్ సాంగ్‌లో న‌టించింది. ఇక య‌శోద వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది. జాన్ పిలిప్ ద‌ర్శ‌క‌త్వంలో అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీలోనూ న‌టించ‌డానికి స‌మంత ఓకే చెప్పింది. ఈ సినిమాల‌న్నీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్నాయి. మ‌రో వైపు.. బాలీవుడ్‌లోనూ స‌మంత ఎంట్రీ ఇవ్వ‌నుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nLExwn

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk