Saturday, 22 January 2022

Mahesh Babu : అద్భుతమైన నటుడు, అంతకన్నా మంచి మనసున్నవాడు : బాలకృష్ణ

హోస్ట్‌గా చేయడం ఏంటి? అసలు బాలయ్య హ్యాండిల్ చేయగలడా? అందరితో మాట్లాడగలడా? అని కొందరు సెటైర్లు వేశారు. కానీ ఇప్పుడు ఆ నోర్లన్నీ కూడా మూసుకుపోయాయి. బాలయ్య దెబ్బకు విమర్శిన వాళ్లంతా నోరెళ్లబెట్టేశారు. షోను బాలయ్య అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. టాప్ రేటింగ్ సొంతం చేసుకున్న షోగా రికార్డులు క్రియేట్ చేసింది. ముందు చెప్పినట్టుగానే టాక్ షోలకే బాప్ షో అన్నట్టుగా మారింది. అయితే బాలయ్య మాట్లాడే విధానం, వచ్చిన గెస్టులతో ఇమిడిపోయే తీరు అందరినీ ముచ్చటపడేలా చేస్తోంది. స్టార్స్ ఇది వరకు ఎక్కడా కూడా చెప్పని విషయాలను బాలయ్య నెమ్మదిగా లైన్‌లో పెట్టి, వారిని నొప్పించకుండా అడుగుతుంటాడు. మొత్తానికి అన్ స్టాపబుల్ మొదటి సీజన్ ఎపిసోడ్ ముగుస్తోంది. ఈ ఫిబ్రవరి 4న చివరి ఎపిసోడ్ రాబోతోంది. అది కూడా గెస్టుగా వచ్చిన ఎపిసోడ్‌తోనే ముగుస్తోంది. అయితే బాలయ్య సూపర్ స్టార్‌ను హ్యాండిల్ చేసిన విధానం, చూపించిన మరో కోణంతో ప్రోమో ఒక్కసారిగా వైరల్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే.. కేవలం సినిమాలు అని కాదు.. మానవీయకోణం ఉందని, తన పిల్లలు, ఫ్యామిలీ అంటూ ఇలా ముందుకు సాగించాడు. మహేష్ బాబుతో చేసిన ఎపిసోడ్ గురించి బాలయ్య తన ఫేస్ బుక్‌లో షేర్ చేశాడు. అద్భుతమైన నటుడు, అంతకన్నా మంచి మనసున్న మన సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఎపిసోడ్ ఫిబ్రవరి 4న రాబోతోంది అని చెప్పుకొచ్చాడు. ఇక రెండో సీజన్‌కు చిరంజీవిని హోస్ట్‌గా తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3Ixdj4v

No comments:

Post a Comment

'Acting Is Such A Rich Man's Business Now'

'It's no more just art and skills, it's a business.' from rediff Top Interviews https://ift.tt/rQNK1fd