Monday, 24 January 2022

జీవితంలో ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదు.. నమ్రత ఎమోషనల్ పోస్ట్

మహేష్ బాబు సతీమణి, హీరోయిన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విశేషాలతో పాటు మహేష్ బాబు సినిమా సంగతులను నెటిజన్ల ముందుంచుతూ సూపర్ స్టార్ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామీలీ ట్రిప్స్, కుటుంబంతో జరుపుకున్న స్పెషల్ ఈవెంట్ ఫొటోస్ అందరితో పంచుకోవడమంటే నమ్రతకు మహా సరదా. ఈ క్రమంలోనే తాజాగా తన పిల్లలిద్దరితో ఓ స్పెషల్ మూమెంట్ షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు నమ్రత. రీసెంట్‌గా జనవరి 22న తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు నమ్రత శిరోద్కర్. ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన మహేష్, ఇద్దరు పిల్లలు సితార, గౌతమ్‌లతో ఎంజాయ్ చేశారు. అయితే ఆ సంబరాల నుంచి ఓ ర్యాండమ్ పిక్‌ని తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన నమ్రత.. ''ప్రతి రోజు.. పిల్లలతో జాలీగా గడపడం కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు'' అంటూ తన ఇద్దరు పిల్లలపై ఉన్న అపారమైన ప్రేమను మరోసారి బయట పెట్టారు. దీంతో ఎప్పటిలాగే ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటో క్షణాల్లో వైరల్ కావడమే గాక దీనిపై లైకుల వర్షం కురుస్తోంది. కొడుకు, కూతురు అంటే అటు మహేష్ బాబు, ఇటు నమ్రత చాలా ఇష్టంగా ఉంటారు. ఓ వైపు తమ తమ ప్రెఫెషనల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఏ మాత్రం గ్యాప్ దొరికినా పిల్లలిద్దరితో కలిసి వెకేషన్ ట్రిప్స్ వేయడం మహేష్- నమ్రత హ్యాబీ. దీంతో ఈ సెలబ్రిటీ ఫ్యామిలీ బాండింగ్, ప్రేమానురాగాలు చూసి 'ది కంప్లీట్ ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ, క్యూట్ కపుల్' ఇలా పలు రకాలుగా రియాక్ట్ అవుతుంటారు నెటిజన్లు. ఇకపోతే పెళ్లికి ముందు సినిమా హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ తన భర్త వ్యాపార కార్యకలాపాల్లో భాగమవుతున్నారు నమ్రత శిరోద్కర్. గృహిణిగా పిల్లల బాధ్యతతో పాటు మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలన్నీ ఆమెనే దగ్గరుండి చూసుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nRvKJq

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk