Wednesday, 19 January 2022

Samayam Telugu Awards 20 -21: ‘స‌మ‌యం తెలుగు’ అవార్డ్స్ 2020-21.. ఉత్తమ నటుడు నందమూరి బాలకృష్ణ

సినీ ప‌రిశ్ర‌మ‌ను క‌రోనా వైరస్ చాలా దెబ్బ తీసింది. దాదాపు రెండేళ్లుగా అనుకున్న స‌మ‌యంలో సినిమాలు థియేట‌ర్స్‌లో సందడి చేయ‌లేదు. క‌రోనా రెండు వేవ్స్ వ‌చ్చిన‌ప్పుడు థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. మ‌ళ్లీ ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డగానే థియేట‌ర్స్ ఓపెన్ అయ్యి సినిమాలు థియేట‌ర్స్‌లో సంద‌డి చేశాయి. వీటిలో కొన్ని సినిమాలు సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌గా.. మ‌రికొన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌ల ద్వారా ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్నాయి. ఏదేమైనా 2020-21 ఏడాదికిగానూ సినీ ప్రేమికుల‌కు ఆనందాన్ని అందించిన చిత్రాల్లో ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు, ప్ర‌తినాయ‌కుడు, ఉత్త‌మ న‌టి, మేల్ సింగ‌ర్‌, ఫిమేల్ సింగ‌ర్‌, సంగీత ద‌ర్శ‌కుడు.. ఎవ‌రు? అనే విష‌యంపై ప్రేక్ష‌కుల అభిప్రాయాల‌ను ఓటింగ్ ప‌ద్ధ‌తి ద్వారా తీసుకుని విజేత‌ల‌ను నిర్ణ‌యిస్తున్న ‘స‌మ‌యం తెలుగు’ అవార్డ్స్‌ను ప్ర‌క‌టించారు. ఆ వివ‌రాలేంటో ఇప్పుడు చూద్దాం... ఉత్త‌మ చిత్రం : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ చిత్రం కేట‌గిరిలో ఉత్త‌మ చిత్రం పోటీ ప‌డ్డ చిత్రాలు అఖండ‌, వ‌కీల్ సాబ్‌, జాతి ర‌త్నాలు, క్రాక్‌. ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యి.. వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ఇందులో అఖండ ఉత్త‌మ చిత్రంగా నిలిచింది. అఖండ - 44 %, జాతి ర‌త్నాలు - 33%, వ‌కీల్ సాబ్ - 19%, క్రాక్ - 4% ఓట్ల‌ను ద‌క్కించుకున్నాయి. ఉత్త‌మ న‌టుడు : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ న‌టుడు కేట‌గిరిలో బాల‌కృష్ణ (అఖండ‌), ప‌వ‌న్ క‌ళ్యాణ్ (వ‌కీల్ సాబ్‌), వెంక‌టేష్ (నార‌ప్ప‌, దృశ్యం 2), ర‌వితేజ (క్రాక్‌) పోటీ ప‌డితే, నంద‌మూరి బాల‌కృష్ణ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక‌య్యారు. బాల‌కృష్ణ - 47 %, ప‌వ‌న్ క‌ళ్యాణ్ - 24 %, వెంక‌టేష్ - 23 %, ర‌వితేజ - 6% ఓట్ల‌ను ద‌క్కించుకున్నారు. ఉత్త‌మ న‌టి : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ న‌టి కేట‌గిరిలో సాయి ప‌ల్ల‌వి (ల‌వ్ స్టోరి ), కృతి శెట్టి (ఉప్పెన‌), పూజా హెగ్డే (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌), శ్రుతి హాస‌న్ (క్రాక్‌), సునైన (రాజ రాజ చోర‌) పోటీ ప‌డ‌గా అందులో సాయిప‌ల్ల‌వి విజేత‌గా నిలిచారు. సాయి ప‌ల్ల‌వి - 61, కృతి శెట్టి -25, పూజా హెగ్డే - 7%, శ్రుతి హాస‌న్ - 4 %, సునైన -3 % ఓట్ల‌ను పొందారు. ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు: స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ ప్ర‌తినాయ‌కుడు కేట‌గిరిలో శ్రీకాంత్ (అఖండ‌), స‌ముద్ర ఖ‌ని (క్రాక్‌), ర‌మ్య‌కృష్ణ (రిప‌బ్లిక్‌), ర‌విబాబు (రాజ రాజ చోర‌) పోటీ ప‌డగా శ్రీకాంత్ మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకున్నారు. ఓటింగ్‌లో శ్రీకాంత్ -63 %, స‌ముద్ర ఖ‌ని - 24 %, ర‌మ్య‌కృష్ణ - 11%, ర‌వి బాబు - 2% శాతం ఓట్ల‌ను ద‌క్కించుకున్నారు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ విభాగంలో బోయ‌పాటి శ్రీను (అఖండ‌), విజ‌య్ కుమార్ క‌న‌క మేడ‌ల (నాంది), అనుదీప్ (జాతి ర‌త్నాలు), గోపీచంద్ మ‌లినేని ( క్రాక్‌), వేణు శ్రీరామ్ (వ‌కీల్ సాబ్‌), హ‌సిత్ గోలి (రాజ రాజ చోర‌) పోటీ ప‌డ‌గా బోయ‌పాటి శ్రీను విన్న‌ర్‌గా నిలిచారు. ఇందులో బోయపాటి శ్రీను 43 శాతం ఓట్ల‌ను సొంతం చేసుకుని మొది స్థానంలో నిలిచారు. ఉత్తమ సంగీత ద‌ర్శ‌కుడు : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు విభాగంలో త‌మ‌న్ (అఖండ‌, వ‌కీల్ సాబ్‌, క్రాక్‌), దేవిశ్రీ ప్ర‌సాద్ (ఉప్పెన‌), ప‌వ‌న్ సి.హెచ్ (ల‌వ్ స్టోరి), గోపి సుంద‌ర్ (మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌), మ‌ణిశ‌ర్మ (నార‌ప్ప‌, సీటీమార్‌) పోటీ ప‌డ‌గా.. త‌మన్ 56 శాతం ఓట్ల‌ను సొంతం చేసుకుని మొద‌టి స్థానంలో నిలిచారు. ఉత్త‌మ మేల్ సింగ‌ర్ : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ మేల్ సింగ‌ర్ విభాగంలో సిద్ శ్రీరామ్ (నీలి నీలి ఆకాశం, మ‌గువ మ‌గువ‌..), అనురాగ్ కుల‌క‌ర్ణి (చుక్క‌ల చున్ని, నీ చిత్రం చూసి), జావెద్ అలీ (నీ క‌న్ను నీలి స‌ముద్రం), అర్మాన్ మాలిక్ ( కంటిపాప కంటిపాప‌), కాళ భైర‌వ (ఇంకో సారి ఇంకోసారి) పోటీ ప‌డ‌గా.. సిద్ శ్రీరామ్ 59 శాతం ఓట్లు ద‌క్కించుకుని మొదటి స్థానంలో నిలిచారు). ఉత్త‌మ ఫిమేల్ సింగ‌ర్ : స‌మయం తెలుగు అవార్డ్స్ 2020-21 ఉత్త‌మ ఫిమేల్ సింగ‌ర్ విభాగంలో మంగ్లీ (సారంగ ద‌రియా), శ్రేయా ఘోష‌ల్ (ఇంకోసారి ఇంకోసారి), హ‌రి ప్రియ (ధ‌క్ ధ‌క్‌), చిన్న‌యి (మ‌న‌సులోనే నిలిచ‌పోవే) పోటీ ప‌డ‌గా.. 75 శాతం ఓట్ల‌ను ద‌క్కించుకుని మంగ్లీ నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33tYCRd

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk