Saturday, 29 January 2022

నాపై అలాంటి ప్రచారం జరిగింది.. చాలా బాధపడ్డా: కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవ్వరి కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది ఎవ్వరూ ఊహించలేరు. కొందరికి తొలి సినిమాతోనే దక్కే క్రేజ్ ఇంకొందరికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ దరిచేరదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నాక అప్పుడు విజయం వరిస్తుంది. ఇది చాలామంది తారల కెరీర్‌లో అప్లై అయింది. అదే లిస్టులో ఉంది సౌత్ ఇండియన్ బ్యూటిఫుల్ హీరోయిన్ . 'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరపై కాలుమోపి ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది కీర్తి. దీంతో దెబ్బకు సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలతో అలరిస్తున్న ఆమె.. రీసెంట్‌గా గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొని తన కెరీర్ విషయాలను, కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్‌ ఆరంభంలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నాని తెలుపుతూ ఆ విషయాలను ప్రస్తావించింది. హీరోయిన్‌గా మలయాళ చిత్ర పరిశ్రమతో తన కెరీర్ మొదలైందని, అయితే ఫస్ట్‌ మూవీ సెట్స్‌ మీదకి వెళ్లిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం.. అలాగే రెండో సినిమా విషయంలోనూ అదే జరగడంతో ఇండస్ట్రీలో తనపై ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర వేశారని చెప్పింది. అప్పట్లో ఓ స్టూడియోకి వెళితే అక్కడ తనను చూసిన కొంతమంది.. ఈ కొత్తమ్మాయిని పెట్టుకుంటే సినిమా ఆగిపోతుందని కామెంట్స్ చేశారని చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అలా కొన్ని అవకాశాలు కూడా చేజారాయని చెప్పుకొచ్చింది. తొలుత అలాంటి కామెంట్స్ బాధగా అనిపించినా క్రమంగా వాటికి అలవాటు పడ్డానని, ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందుకెళ్ళి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని కీర్తి చెప్పింది. సక్సెస్‌ మాత్రమే అవమానాలను ప్రశంసలుగా మార్చగలదని భావించి కష్టపడ్డానని తెలిపింది. ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట', చిరంజీవి 'భోళా శంకర్' సినిమాల్లో నటిస్తోంది కీర్తి సురేష్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/4Jp9gtae5

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...