సూపర్ స్టార్ మహేష్ 27వ సినిమా ‘సర్కారు వారి పాట’. సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. నిజానికి సినిమాను ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు. ప్లానింగ్ కూడా జరిగిపోయింది. అయితే మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలుగా RRR, రాధే శ్యామ్ బరిలోకి వస్తుండటంతో ఆ సినిమాల కోసమని మహేష్ దారిచ్చారు. తీరా కోవిడ్ ప్రభావంతో ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకున్నాయి. సంక్రాంతి నుంచి పక్కకు తప్పుకున్న మహేష్ ఏప్రిల్ 1న రావడానికి రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ‘సర్కారు వారి పాట’ వాయిదా పడుతుందనే టాక్ జోరుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎలాగూ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. రీసెంట్‌గా కోవిడ్ బారిన పడ్డ మహేష్ కోలుకున్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ కోలుకుని షూటింగ్‌ను మొదలెట్టేస్తాడు. ఫిబ్రవరి లోపు ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ను పూర్తి చేసేయాలనేది మహేష్ ప్లాన్. తర్వాత తన 28వ సినిమాను స్టార్ట్ చేసుకుంటారు. అయితే మహేష్ నెక్ట్స్ మూవీ రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రాజమౌళియే తన తదుపరి సినిమాను మహేష్‌తో చేస్తారు. కానీ మహేష్ మాత్రం తన నెక్ట్స్ మూవీని రాజమౌళి కంటే ముందు త్రివిక్రమ్‌తో చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఎలాగో తెలుసా? త్రివిక్రమ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన తమన్.. కోసం వర్క్ స్టార్ట్ చేశామని తెలిపారు. అంటే మహేష్ మూవీ కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయనేగా అర్థం. అంటే రాజమౌళి సినిమాకు సంబంధించిన కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు. మార్పులు చేర్పులు పూర్తయ్యేసరికి సమయం పడుతుంది. ఆలోపు RRR సినిమా విడుదల పనులను పూర్తి చేసి, అవన్నీ అయిన తర్వాతనే మహేష్ సినిమాపై ఫోకస్ చేయాలనేది జక్కన్న ప్లాన్‌గా కనిపిస్తోంది. దీనికి సమయం పడుతుంది. ఇప్పటికే తన నెక్ట్స్ మూవీ కోసం చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకుంటూ వస్తున్న మహేష్, ఈసారి ఎక్కువ సమయం తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమాను ట్రాక్ ఎక్కించేసే పనిలో ఉన్నారట. జక్కన్న సినిమా స్టార్ట్ అయితే మరో సినిమా చేయలేరు. ఆ సినిమా పూర్తి కావడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. కాబట్టి. ఆ లోపు త్రివిక్రమ్ సినిమాను రెడీ చేస్తే ఫ్యాన్స్ గ్యాప్ ఫీల్ కాకుండా ఉంటారనేది మహేష్ ఆలోచన. అందుకనే జక్కన్న కంటే ముందు మాటల మాంత్రికుడితో సినిమా చేయాలని తనకే ఓటు వేశారు మన సూపర్ స్టార్ మహేష్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3I8wYaT
No comments:
Post a Comment