Sunday, 23 January 2022

విజ‌య్ 66 గురించి దిల్ రాజు ప్లానింగ్‌.. ఏమాత్రం త‌గ్గ‌నంటున్న స్టార్ ప్రొడ్యూస‌ర్‌!

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల‌పై ఫోక‌స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయ‌న రెండు భారీ పాన్ ఇండియా సినిమాల‌ను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టి రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ మూవీ. కాగా.. రెండో చిత్రం కోలీవుడ్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో చేస్తున్నారు. ఇది వ‌ర‌కే ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌డింది కూడా. టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిస్తారు. మిగిలిన క‌న్న‌డ‌, మ‌లయాళ‌, హిందీ భాష‌ల్లో అనువాదం చేసి విడుద‌ల చేస్తారు. విజ‌య్ తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో కొలాబ్రేట్ అవుతున్న తొలి చిత్ర‌మిది. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో దిల్ రాజు విజ‌య్‌తో చేయ‌బోయే సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ‘‘మార్చి నుంచి విజయ్ 66వ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ ఏడాది దీపావ‌ళికి సినిమాను విడుద‌ల చేయాల‌నేది మా ప్లానింగ్. అన్నీ స‌వ్యంగా అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగితే దీపావ‌ళికి ఓ మంచి సినిమాతో మీ ముందుకు వ‌స్తాం’’ అన్నారు దిల్ రాజు. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు విజయ్ 66ను ఫ్యామిలీ ఎంటైర్‌టైన‌ర్‌గా రూపొందించనున్నార‌ట‌. శాండిల్ వుడ్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఇందులో హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం హీరో విజ‌య్ త‌న 65వ చిత్రం బీస్ట్‌ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. బీస్ట్ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. సినిమాను ఏప్రిల్ నెల‌లో త‌మిళ సంవ‌త్స‌రాదిన విడుద‌ల చేయాల‌నేది ప్లానింగ్‌గా క‌నిపిస్తోంది. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ఇక దిల్ రాజు మ‌రో వైపు మ‌రో పాన్ ఇండియా మూవీ రామ్ చ‌ర‌ణ్‌తో చేస్తున్నారు. దీనికి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక శంక‌ర్ సినిమా అంటే ఏ రేంజ్‌లో ఉండ‌నుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే కొంత మేర‌కు చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు స‌న్నాహాలు చేసుకుంటున్నారు మ‌రి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3KzSW8T

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk