ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఆతృతగా ఎదురుచూస్తోన్న పాన్ ఇండియా మూవీ RRR. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల కావాల్సింది. కానీ కరోనా ప్రభావంతో మార్చి 18న లేదా ఏప్రిల్ 28కి వాయిదా పడింది. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించున్న సంగతి తెలిసిందే. RRRకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర గురించి మాట్లాడుతూ, ‘‘నాకు రామరాజు పాత్రను ట్రైలర్‌లో చూస్తే.. నిప్పుల మధ్య నుంచి దూకుతూ బాణం సంధించే సన్నివేశం బాగా నచ్చింది. ఎంత బాగా అంటే ఆ పర్టికులర్ సన్నివేశంలో నేను నటించాలనంతేగా. ఆ సన్నివేశంలో బ్యాగ్రౌండ్ స్కోర్, ట్రైలర్‌లో ఆ సన్నివేశాన్ని చూపించిన సందర్భం కావచ్చు’’ అన్నారు సినిమాలోని ఇన్‌టెన్సిటీని సదరు సన్నివేశం చెప్పేస్తుందంటూ ఎన్టీఆర్ రామరాజు పాత్ర గురించి మాట్లాడారు. 1920 బ్యాక్ డ్రాప్‌తో సాగే RRR సినిమా ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. చరిత్రలో ఎన్నడూ కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. ఎన్టీఆర్, చరణ్‌లతో పాటు ఆలియా భట్, అజయ్ దేవగణ్ వంటి బాలీవుడ్ స్టార్స్.. ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో RRRపై భారీ అంచనాలున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3u9xZvP
No comments:
Post a Comment