Thursday, 27 January 2022

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్, టైటిల్ సాంగ్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక తర్జన భర్జనల నడుమ ఎట్టకేలకు ఈ రోజు (జనవరి 28) ప్రేక్షకుల ముందుకొచ్చింది. దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రానికి నటేష్ కుకుమార్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో తెలంగాణ ఊరి ఆడపిల్లగా కీర్తి సురేష్ నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా ఎలా రియాక్ట్ అవుతున్నారు? అనేది చూద్దామా.. ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో కీర్తి సురేష్ నటన అబ్బురపరిచిందని ఇప్పటివరకు వచ్చిన ట్వీట్స్ ఆధారంగా తెలుస్తోంది. స్పోర్ట్ డ్రామా చిత్రంగా విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమా అని చెబుతున్నారు. ఇంటర్వెల్ సీన్స్, సెకండాఫ్ పర్వాలేదని అంటున్నారు. బ్యాడ్ లక్ వెంటాడుతున్న ఓ అమ్మాయి షార్ప్ షూటర్‌గా జగపతి బాబు దగ్గర కోచింగ్ తీసుకొని జాతీయస్థాయిలో ఎలా మంచి పేరు సంపాదిస్తుందనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని, ఈ కథను డైరెక్టర్ అద్భుతంగా మలిచారని ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మళయాలంలో కూడా ఈ సినమా రిలీజ్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33VoXYt

No comments:

Post a Comment

'BJP's Survival Depends On Muslims'

'The irony of this country is that the party in Opposition and the party in power both depend on Muslims.' from rediff Top Intervi...