Sunday, 30 January 2022

Bheemla Nayak : ప‌వ‌న్‌గారూ! ద‌య‌చేసి అది నిరూపించండి.. క‌న్నీటితో రామ్ గోపాల్ వ‌ర్మ రిక్వెస్ట్‌!

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో ప్రశ్నించ‌డానికి ఎప్పుడూ ముందుంటారు. సోష‌ల్ మీడియాను ఆయ‌న వాడుకున్నంత గొప్ప‌గా మరొక‌రు వాడుకోవ‌డం లేదంటే అందులో అతిశ‌యోక్తి లేదు. మొన్న‌టి వ‌ర‌కు ఏపీలో సినిమా టికెట్ రేట్స్ గురించి ట్విట్టర్‌లో ప్ర‌శ్న‌ల‌డ‌గ‌డం, యూట్యూబ్‌లో వీడియో విడుద‌ల చేయడం, టీవీల్లో ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం వంటి చేసిన వ‌ర్మ కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్ప‌డు మ‌ళ్లీ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న‌దైన పంథాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రిక్వెస్ట్‌లు పెట్టారు. సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను, ఆయ‌న ఫ్యాన్స్‌ని, మెగా ఫ్యాన్స్‌ని గిల్లిన‌ట్లు వ‌ర్మ ట్వీట్స్ చేస్తుంటారు. అదేంటి? అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే నేను మెగా ఫ్యామిలీకి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి పెద్ద అభిమాని అంటూ బ‌దులిస్తారు. ఇప్పుడు కూడా మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్‌లా ఆయ‌న్ని ప్ర‌శ్నిస్తున్నారో లేక రిక్వెస్టులు చేస్తున్నారో తెలియ‌న‌ట్లు కొన్ని ట్వీట్స్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్‌గారు.. ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్‌ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి. పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేం. అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి. ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తార‌క్‌, రామ్ చ‌ర‌ణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్‌కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి. ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా ? ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారూ? ’’ అని ట్వీట్స్ చేశారు. మ‌రి దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాగూ రియాక్ట్ కారు. మ‌రి భీమ్లా నాయ‌క్ మేక‌ర్స్ ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/S6zFurCVp

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....