Saturday, 15 January 2022

Allu Arjun : ‘పుష్ప’లో ‘శ్రీవల్లి...’ పాటకు స్టెప్పులేసిన ఇండియన్ క్రికెటర్స్

అంటే పువ్వనుకుంటివా.. ఫైరు.. అంటూ పుష్పరాజ్‌గా ఐకాన్ స్టార్ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హిట్ కొట్టారు. త‌గ్గేదే లే అంటూ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసేశారు. ఇక అల్లు అర్జున్ సినిమాలో యాక్ష‌న్‌, ఫైట్సే కాదు.. చ‌క్క‌టి డాన్సులు కూడా ఉంటాయి. అలాంటి పాట‌ల‌తోనూ పుష్ప‌రాజ్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశారు. కేవ‌లం ఫ్యాన్సీ, సినీ ప్రేక్ష‌కులనే కాదండోయ్‌.. సెల‌బ్రిటీల‌ను కూడా త‌న బుట్ట‌లో వేసుకున్నారు మ‌న బ‌న్నీ. వాళ్లూ వీళ్లూ కాదు.. ఏకంగా ఇండియ‌న్ క్రికెట‌ర్స్ సైతం పుష్ప మేనియాలో మునిగి ఉన్నారు. ఇప్ప‌టికే ఆసీస్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, ఇండియ‌న్ క్రికెటర్స్ ర‌వీంద్ర జ‌డేజా, శిఖ‌ర్ ధావ‌న్ వంటి స్టార్ క్రికెట‌ర్స్ సైతం పుష్ప ది రైజ్ సినిమాలోని త‌గ్గేదే లే డైలాగ్‌ను చెప్పి అంద‌రినీ అల‌రించారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రికొంద‌రు క్రికెట‌ర్స్ జాయిన్ అయ్యారు. వారెవ‌రో కాదు.. ఇండియ‌న్ క్రికెట్ టీమ్ మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాద‌వ్‌, ఇషాన్ కిష‌న్‌. వీరిద్ద‌రూ పుష్ప సినిమాలో ‘చూపే బంగారమాయెనా..’ అనే సాంగ్‌తో బ‌న్నీ చెప్పు జార‌విడుకునే స్టెప్పును వేశారు. ఈ డాన్సింగ్ వీడియోను పుష్ప టీమ్ త‌మ అధికారిక సోష‌ల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఆ వీడియో వైర‌ల్ అవుతుంది. ALSO READ : ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం పుష్ప ది రైజ్‌. శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమాను సుకుమార్ తెర‌కెక్కించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించాయి. పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టించారు. పుష్ప చిత్రాన్ని సుకుమార్ రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. అందులో తొలి భాగంగా పుష్ప ది రైజ్ మూవీ డిసెంబ‌ర్ 17న‌ విడుద‌లైంది. ఇందులో ఎర్ర చంద‌నం కూలీగా వ‌చ్చిన పుష్ప‌రాజ్ సిండికేట్ నాయ‌కుడిగా ఎలా ఎదిగార‌నేదే క‌థాంశం. ఇక రెండో భాగం ‘పుష్ప ది రూల్‌’ చిత్రం ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి నుంచి చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకోనుంది. ALSO READ :


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ftS9YK

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...