ఈ సంక్రాంతి హవా మొత్తం అక్కినేని వారసులదే అనిపిస్తోంది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన '' సినిమాకు అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ‘సొగ్గాడే చిన్న నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే అదరగొట్టింది. ఇక రెండో రోజు కూడా అదే కంటిన్యూ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగార్రాజు డే వైజ్ కలెక్షన్స్ చూస్తే.. డే 1: 9.06 కోట్లు డే 2: 7.79 కోట్లు మొత్తంగా ఈ రెండు రోజుల్లో కలిపి 16.85 కోట్ల నెట్, 27 కోట్ల గ్రాస్ వసూలైంది. అయితే మీడియం రేంజ్ సినిమాల పరంగా బంగార్రాజు రెండో రోజు కలెక్షన్స్ కొత్త రికార్డు నెలకొల్పాయి. గతంలో ఉప్పెన సినిమా రెండో రోజుకు గాను 6.86 కోట్లు కలెక్ట్ చేయగా.. ఇప్పుడు దాన్ని అధిగమించి బంగార్రాజు 7.79 కోట్లు రాబట్టింది. దీంతో ఉప్పెన పేరిట ఉన్న రికార్డ్ బంగార్రాజు బుట్టలో వేసుకున్నాడు. రెండో రోజు ఏరియాల వారిగా బంగార్రాజు కలెక్షన్ రిపోర్ట్.. నైజాం: 2.41 కోట్లు సీడెడ్: 1.66 కోట్లు ఉత్తరాంధ్ర: 93 లక్షలు ఈస్ట్ గోదావరి: 88 లక్షలు వెస్ట్ గోదావరి: 49 లక్ష గుంటూరు: 61 లక్షలు కృష్ణా: 49 లక్షలు నెల్లూరు: 32 లక్ష మొత్తంగా చూస్తే అన్ని ఏరియాల్లో కలిపి 7.79 కోట్ల నెట్, 13 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అన్ని ఏరియాలకు కలిపి 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా 39 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ప్రస్తుతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయడం సులువే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FsrPIV
No comments:
Post a Comment