ఐకాన్ స్టార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో సాధించిన సక్సెస్‌తో అల్లు అర్జున్ హీరోగా నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నారు. ఇక పుష్పరాజ్ విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 300 కోట్లకు పైగానే వసూళ్లను సాధించింది. ముఖ్యంగా దక్షిణాది కంటే బాలీవుడ్‌లో పుష్ప సినిమా .. కలెక్షన్స్ రాబట్టడంలో సక్సెస్ కావడం గొప్ప విషయం. ఎందుకంటే విడుదలైన రోజు అంటే డిసెంబర్ 17న బాలీవుడ్‌లో సినిమా మూడు కోట్ల రూపాయల పైచిలుకు వసూళ్లను దక్కించుకుంది. ఇది చాలా తక్కువ. ఇంకేముంది సినిమా పోయినట్లేనని అందరూ అనుకున్నారు. అయితే పుష్ప ది రైజ్ రోజు రోజుకీ వసూళ్లను పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు రూ. 100 కోట్ల మార్క్‌ను చేరుకోవడం అనేది బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు షాక్. ఇక దక్షిణాది నుంచి హిందీలోకి డబ్బింగ్ అయ్యి వంద కోట్ల రూపాయల మార్కును చేరుకున్న చిత్రాల్లో పుష్ప ది రైజ్ ఐదో స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్‌లో వంద కోట్ల రూపాయల సాధించి దక్షిణాది సినిమాల లిస్టు చూస్తే... 1. బాహుబలి ది కన్ క్లూజన్ - రూ. 510.99 కోట్లు2. 2.0 - రూ.189.55 కోట్లు3. సాహో - 142.95 కోట్లు4. బాహుబలి ది బిగినింగ్ - 118.70 కోట్లు5. పుష్ప ది రైజ్ - 100.38 కోట్లు వచ్చాయి. పుష్ప ది రైజ్‌కి కొనసాగింపుగా రూపొందనున్న పుష్ప ది రూల్ చిత్రం ఫిబ్రవరి లేదా మార్చి నుంచి రెగ్యులర్‌గా చిత్రీకరణను జరుపుకోనుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమా వచ్చింది. సునీల్, అనసూయ, ధనంజయ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/g7VdxBhNG
No comments:
Post a Comment