Wednesday, 26 January 2022

Ram Charan - Keerthy Suresh : రామ్ చ‌ర‌ణ్‌తో కీర్తి సురేష్ నాటు నాటు స్టెప్.. వీడియో వైరల్!

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన పాన్ ఇండియా మూవీ RRR. కోవిడ్ కార‌ణంగా సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప్ర‌తి ప్రోమో, టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్ ఆడియెన్స్‌కు బాగా న‌చ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి స్టెప్పులేసిన ‘నాటు నాటు.. ’ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో తార‌క్ - చ‌ర‌ణ్ క‌లిసి చేసిన స్టెప్పుల‌ను అంద‌రూ వేసి ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ క‌లిసి దుమ్ము రేపిన నాటు నాటు సాంగ్‌ని రామ్ చ‌ర‌ణ్ - క‌లిసి చేస్తే ఎలా ఉంటుంది! బాగానే ఉంటుంది. హ్యాండ్స‌మ్ హీరో, క్యూట్ హీరోయిన్ క‌లిసి స్టెప్పేస్తే బాగానే ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ బుధ‌వారం గుడ్ ల‌క్ స‌ఖి ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవ‌వి ఈ వేడుక‌కి ముఖ్య అతిథిగా రావాల్సింది. కానీ ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్దార‌ణ కావ‌డంతో ఆయ‌న స్థానంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా విచ్చేశారు. అజ్ఞాత‌వాసిలో కీర్తి సురేష్ న‌ట‌న బావుంటుందని, ‘మ‌హా న‌టి’ సినిమా చూసిన త‌ర్వాత కీర్తి సురేష్ న‌ట‌న‌కు ఫిదా అయ్యాన‌ని చెప్పిన రామ్ చ‌ర‌ణ్. ‘’ సినిమా చిన్న‌ సినిమా కాద‌ని.. ఒక వైపు మ‌హాన‌టితో జాతీయ అవార్డు అందుకున్న న‌టి కీర్తిసురేష్‌.. మ‌రో వైపు జాతీయ అవార్డ్ అందుకున్న డైరెక్ట‌ర్ న‌గేష్ ఉన్న‌ప్పుడు దాన్ని చిన్న అనడం కరెక్ట్ కాదని చెప్పిన రామ్ చరణ్..మూవీ పెద్ద హిట్ కావాలని చెబుతూ డైరెక్టర్ నగేష్ కుకునూర్ అండ్ టీమ్‌ను అభినందించారు. అనంత‌రం కీర్తి సురేష్ స్టేజ్ పైకి వ‌చ్చి నాటు నాటు స్టెప్ వేయాల‌ని ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్‌ను కోరారు. ‘ఎవ‌రితో అయినా అద్భుతంగా న‌టించ‌గ‌ల‌, నాకెంతో ఇష్టమైన మహానటి కీర్తి సురేష్ అడిగారు కాబట్టి ఏమాత్రం ఆలోచించ‌కుండా ఒప్పుకుంటున్నా’ అని చెప్పిన చరణ్.. ‘కీర్తితో మీకు ఆ స్టెప్ వ‌చ్చా ఓసారి అయితే లైట్‌గా వేసి చూపించండి’ అని చెప్పి, ఆమె వేసిన త‌ర్వాత స‌ర‌దాగా కీర్తితో క‌లిసి నాటు నాటు స్టెప్పు వేశారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35lOZUZ

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...