Sunday, 16 January 2022

Rashmi Gautam : ‘ఊ అంటావా మావ..’ సమంతను దించేసిన రష్మి.. రోజా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే..

ఈ మధ్య కాలంలో ఆడియెన్స్‌కు తెగ న‌చ్చేసి అంద‌రి మ‌న‌సుల‌ను ఓ ఊపు ఊపేసిన సాంగ్ ‘ఊ అంటావా మావ ఉ ఉ అంటావా మావ ’. స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి త‌న కెరీర్‌లో చేసిన ఐటెమ్ సాంగ్‌. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప ది రైజ్’లో సాంగ్ ఇది. ఇప్పుడు ఎక్క‌డ విన్నా అదే సాంగ్ వినిపిస్తోంది. అంత ఎఫెక్ట్ చూపింది. చాలా మంది సెల‌బ్రిటీలు ఈ సాంగ్‌కు త‌మదైన స్టైల్లో స్టెప్పులేసి ఆ వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు హాట్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ కూడా ‘ఊ అంటావా మావ..’ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈటీవీ అమ్మ‌మ్మ ఊరు అనే కార్య‌క్ర‌మంలో భాగంగా ర‌ష్మీ గౌత‌మ్ త‌న డాన్స్ స్టెప్పుల‌తో క‌నువిందు చేసింది. స‌మంత‌ను స్టెప్పుల‌తోనే కాదు, హావ భావాల‌తోనూ అలాగే దించేసిన‌ట్ల‌పించింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రోజా, ఆమ‌ని పాట‌ను తెగ ఎంజాయ్ చేశారు. రోజా అయితే అరుపుల‌తో తెగ గోల చేశారు. ఇక వ‌ర్ష‌, ఇమ్మాన్యుయేల్ కూర్చున్న ద‌గ్గ‌రే నిల‌బ‌డి డాన్స్ చేశారు. హైపర్ ఆది అండ్ టీమ్ కూడా ఈ గోల‌లో భాగ‌మ‌య్యారు. ఇక పాట పూర్త‌యిన త‌ర్వాత ర‌ష్మీ గౌత‌మ్ గురించి రోజా మాట్లాడుతూ ఇప్పుడు ఎవ‌రు నోట విన్నా అదే పాట‌. ఆ పాట‌ను నువ్వు చేయ‌డం ఇంకా బాగుంద‌ని అప్రిషియేట్ చేయ‌గా, ఆమ‌ని మాట్లాడుతూ ర‌ష్మి డాన్స్‌లో మంచి గ్రేస్ ఉంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప్పెన‌, బంగార్రాజు హీరోయిన్ కృతి శెట్టి కూడా హాజ‌ర‌య్యారు. స‌మంత న‌ర్తించిన ‘ఊ అంటావా మావ..’ సాంగ్ పూర్తి వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గానే విడుద‌ల చేసింది. తెలుగులో ఈ వీడియో సాంగ్ ఇప్ప‌టికే యాబై మిలియ‌న్ వ్యూస్‌ను ద‌క్కించుకుని, వ్యూస్ ప‌రంగా దూసుకెళుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యాన్ని వ‌హించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tuzrIJ

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...