
మలయాళ నటి ఆత్మహత్య చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు నటిపై 2017లో వేధింపుల కేసును తిరిగి విచారణ చేస్తున్నారని, దీంతో ఆమె భయాందోళనలకు గురై , ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ సదరు నటి భామ వివరణ ఇచ్చారు. ‘‘ఇటీవల సమయంలో నాపై భయంకరమైన ఆరోపణలు, రూమర్స్ వినిపించాయి. అవన్నీ అవాస్తవం. నాపై, నా కుటుంబంపై ప్రేమాభిమానాలను కనపరిచిన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. లోహిత దాస్ దర్శకత్వంలో వచ్చిన నైవేద్యం సినిమాతో సినీ పరిశ్రమంలో నటి భామ అడుగు పెట్టారు. తర్వాత జనప్రియం, ఇవర్ వివాహతారియల్, సైకిల్ వంటి పలు సౌత్ ఇండియన్ మూవీస్‌లో నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం ఖలీఫత్ 2018లో విడుదలైంది. 2020లో బిజినెస్‌మేన్ అరుణ్‌ను పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమయ్యారు. గత ఏడాది ఓ అమ్మాయికి జన్మనిచ్చిన ఈమె రీసెంట్‌గానే కుమార్తె పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేశారు. మోతాదుకి మించిన నిద్రమాత్రలు మింగటంతో భామ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిందని, పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆమెను ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ చేశారంటూ వార్త బయటకు వచ్చింది. ఇంకేముంది.. ఈ వార్తలు సోషల్ మీడియాలో పలువలు చిలువలుగా స్ప్రెడ్ అయ్యింది. విషయం భామ వరకు వెళ్లడంతో ఆమె వెంటనే సదరు వార్తలను ఖండిస్తూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. దీంతో భామ ఆత్మహత్య వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3rtCXR8
No comments:
Post a Comment