Friday, 21 January 2022

‘పుష్ప’ సినిమా స్ఫూర్తితో టీనేజ‌ర్స్‌ దారుణం.. చ‌నిపోయిన బాధితుడు!

యువ‌తలో స్ఫూర్తి నింపే మాధ్య‌మాల్లో సినిమా ఒక‌టి. అందుకే సినిమాను చాలా మంది శ‌క్తివంత‌మైన మాధ్య‌మంగా సూచిస్తుంటారు. సినిమాల్లో చూపించే అంశాల‌ను ప‌రిశీలిస్తే మంచి, చెడు..రెండూ క‌నిపిస్తాయి. వాటిలో యువ‌త మంచిని స్ఫూర్తిగా తీసుకుంటే స‌మాజానికి మేలు జ‌రుగుతుంది. అదే చెడుకి ఆకర్షితుడైతే స‌మాజానికి చెడే జ‌రుగుతుంది. ఇప్పుడు రీసెంట్‌గా విడుద‌లైన టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ ది రైజ్‌, ఓ హిందీ వెబ్ సిరీస్‌లోని చెడు వైపుకి ఆక‌ర్షితులైన ముగ్గురు టీనేజ‌ర్స్ ఓ వ్య‌క్తి చావుకు కార‌ణం అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జ‌హంగీర్‌పుర్‌లో గాయాల పాలైన శిబు అనే యువ‌కుడు బాబు జ‌గ్గీవ‌న్ రామ్ ఆసుప‌త్రిలో చ‌నిపోయారు. కేసును విచారించే క్ర‌మంలో పోలీసులు ఊహించ‌ని నిజాలు తెలిసి త‌ల‌లు ప‌ట్టుకున్నారు. అస‌లు ఏం జ‌రిగింది అనే వివ‌రాల్లోకి వెళితే.. జ‌హంగీర్ పూర్‌లో బ‌స్తీలో నివాసం ఉంటున్న ముగ్గురు టీనేజర్స్ బ‌ద్నాం పేరుతో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశారు. పాపులారిటీ సంపాదించాల‌నే కోరిక‌తో ఆ ఏరియాలోని ఇత‌రుల‌ను బెదిరిస్తూ వాటిని వీడియోలుగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వ‌చ్చారు. తాజాగా ఈ బ‌ద్నాం గ్యాంగ్ పుష్ప సినిమా చూసి నెక్ట్స్ రేంజ్‌కు ఎద‌గాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకోసం శిబు అనే అమాయ‌కుడిని టార్గెట్ చేశారు. శిబుని బద్నాం గ్యాంగ్ చిత‌బాద‌డ‌మే కాకుండా వీడియో తీసింది. ఇక లాభం లేద‌ని భావించిన స్థానికులు వారిని చెద‌ర‌గొట్టి శిబుని బాబు జ‌గ్గీరామ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే శిబు హాస్పిట‌ల్లో చికిత్స తీసుకుంటూ మ‌ర‌ణించాడు. అత‌ని బంధువులు ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసుని విచార‌ణ చేశారు. ఆ క్ర‌మంలో అక్క‌డున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా బ‌ద్నాం గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. విచార‌లో వారు పుష్ప ది రైజ్ సినిమాతో పాటు బౌకాల్ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా ఎదిగాల‌నుకున్నామ‌ని స‌ద‌రు నేరం చేసిన టీనేజ‌ర్స్ చెప్ప‌డంతో విస్తు పోయారు పోలీసులు. ఈ ముగ్గురు టీనేజర్స్ కూడా మైనర్స్ కావడం గమనార్హం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FMT6Gd

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....