Thursday, 13 January 2022

‘హీరో’ కోసం నటుడిగా మారిన అనిల్ రావిపూడి!

మంచి ఫాంలో ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తన కెరీర్‌లో తెరకెక్కించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతూనే వచ్చింది. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్ ఇచ్చి మళ్లీ నిలబెడుతుంటాడు. అలా నందమూరి కళ్యాణ్ రామ్‌తో పటాస్, రవితేజతో రాజా ది గ్రేట్, సాయి ధరమ్ తేజ్‌తో సుప్రీమ్ ఇలా వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేశాడు. ఇక అనిల్ రావిపూడి కెరీర్‌లో ఎఫ్ 2 సినిమా అనేది టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవాలి. దిల్ రాజుకు భారీ లాభాలను తీసుకొచ్చిన సినిమాగా ఎఫ్ 2 నిలిచిపోయింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అంటూ హిట్ కొట్టేశాడు. ఇక ఇప్పుడు ఎఫ్ 3 పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ డైరెక్టర్‌లో చాలా టాలెంట్స్ ఉన్నాయి. మిమిక్రీ చేయగలడు.. డ్యాన్సులు అద్బుతంగా వేయగలడు. అవ్వాలనే కోరిక ఏదో ఒక మూలన ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు నటుడిగా మారాడు. అది కూడా తన ఫ్రెండ్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించినర హీరో సినిమా కోసం. ఈ సినిమా హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు హీరోగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో తన జీవితంలో కారెక్టర్‌ను తానే పోషించమని శ్రీరామ్ అడిగాడంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. హీరో సినిమాలో తాను అనిల్ రావిపూడి పాత్రలోనే కనిపిస్తాను అని అన్నాడు. హీరో చాన్సుల కోసం తన వద్దకు వస్తాడు అని ఓ సీన్ గురించి చెప్పేశాడు. అది చాలా బాగా వచ్చిందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33uc1Iu

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....