Thursday, 27 January 2022

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. యంగ్ రెబల్ స్టార్‌తో సినిమా చేసేందుకు వందల కోట్లయినా ఖర్చు చేస్తాం అనే నిర్మాతల లిస్ట్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ '' గురించి బయటకొచ్చిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఆయన అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా 'ఆదిపురుష్' సినిమాను రూపొందించారు. పౌరాణిక గాథ రామాయణంను ఈ 'ఆదిపురుష్' రూపంలో చూపించనున్నారు. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకున్న యూనిట్.. అన్ని హంగులతో కేవలం 103 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి రికార్డు చేశారు. మొత్తంగా ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. టీ సిరీస్ బ్యానర్‌పై ఐదు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ 'ఆదిపురుష్' చిత్రాన్ని ప్యాన్ వరల్డ్ సినిమాగా మలిచే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. 'ఆదిపురుష్' సినిమాను ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. ఈ విషయమై డిస్నీ స్టూడియోస్‌తో దర్శకనిర్మాతలు చర్చలు జరుపుతున్నారనేది లేటెస్ట్ సమాచారం. ఈ చర్చలు సఫలమైతే ఆదిపురుష్ ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ కానుందట. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై సుమారు 2000 కోట్ల మేర బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయని పలువురు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమై ఆదిపురుష్ హాలీవుడ్ రేంజ్‌ రిలీజ్ అయితే ఇక ప్రభాస్ క్రేజ్ ఊహకందడం కూడా కష్టమే. ఇకపోతే వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్.. ఇప్పటికే 'రాధేశ్యామ్' మూవీ కంప్లీట్ చేయడంతో ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్వకత్వంలో మరో సినిమాను చేస్తున్నారు ప్రభాస్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ALfCyn

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk