టాలీవుడ్ కామెడీ కింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు బ్రహ్మానందం. ఒకానొక దశలో తెలుగులో ఆయన లేని సినిమా ఉండేది కాదు. చిన్న పాత్రలో ఆయన కనిపించేవారు. అంత క్రేజ్ సంపాదించుకున్నారు బ్రహ్మానందం. ఈ నవ్వుల బ్రహ్మ అప్పట్లో తన క్రేజ్‌కు తగినట్లే రెమ్యునరేషన్ కూడా వసూలు చేసేవారు. ఓ రోజుకు ఆయనకు ఐదు లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేవారని కూడా వార్తలు వినిపించాయి. అలాంటి ఆయన ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించటం లేదు. వయసు రీత్యా వచ్చిన సినిమాలన్నీ చేయాలని బ్రహ్మానందం అనుకోవడం లేదా? లేక మరేదైనా కారణమో తెలియడం లేదు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమాల్లో సొగ్గాడే చిన్ని నాయనా ఒకటి. ఐదేళ్ల ముందు సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు సినిమా విడుదలై ఇంకా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. సొగ్గాడే చిన్ని నాయనాలో కనిపించిన కొన్ని పాత్రలు బంగార్రాజు సినిమాలో కనిపించలేదు. అందులో బ్రహ్మానందం పాత్ర కూడా ఒకటి. ఆయన్ని ఎందుకు బంగార్రాజు సినిమాలో తీసుకోలేదు అని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అక్కినేని నాగార్జునను ప్రశ్నిస్తే, ఆయన మాట్లాడుతూ ‘‘‘సొగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కనిపించిన అన్నీ పాత్రలను కథానుగుణంగా ‘బంగార్రాజు’ సినిమాలో తీసుకోలేం. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత నడిచే కథగా బంగార్రాజును చూపించాం. అంటే సొగ్గాడే చిన్ని నాయనాలో యంగ్‌గా కనిపించిన వారందరినీ ఈ సినిమాలో మళ్లీ యంగ్‌గా చూపించలేం. అందుకనే కొన్ని పాత్రలు మనకు బంగార్రాజులో కనిపించవు. ఉదాహరణకు అనసూయ పాత్రను ఓల్డ్‌గా చూపించలేం. అలాగే బ్రహ్మానందం పాత్రను తీసుకుంటే దాన్ని 80-85 పాత్రగా చూపించాలి. అలాంటి సమస్య వస్తుందని ఆ పాత్రను చూపించలేదు’’ అని అన్నారు. అక్కినేని నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా ఇందులో నటించారు. నాగ్ జోడీగా రమ్యకృష్ణ కనిపిస్తే.. చైతన్య జోడీగా కృతి శెట్టి కనిపించింది. కళ్యాణ్ కృష్ణ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమా తొలి మూడు రోజుల్లోనే యాబై కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి కెరీర్ బెస్ట్ మూవీగా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి విన్నర్ అయ్యింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3IrUwrj
No comments:
Post a Comment