Monday, 24 January 2022

'అఖండ'పై బీ టౌన్ పీపుల్ డిమాండ్స్.. ఇది కదా బాలయ్య క్రేజ్ అంటే!!

నందమూరి నటసింహం క్రేజ్ అంటే ఇదీ మరి అని 'అఖండ' సినిమాతో మరోసారి నిరూపణ అయింది. 'ప్యాన్ ఇండియా సినిమా తీయడం వేరు.. తీశాక ప్యాన్ ఇండియా క్రేజ్ రావడం వేరు' ఈ రెండిటికీ ఉన్న తేడానే సదరు సినిమా లెవెల్ ఏంటనేది స్పష్టం చేస్తుంది. ఇప్పుడు బాలకృష్ణ సినిమా విషయంలో అదే జరుగుతోంది. మూవీ కోసం బాలీవుడ్ తెరలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ సినిమా హిందీ వర్షన్ కావాలంటూ సోషల్ మీడియాలో బీ టౌన్ పీపుల్ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ‘అఖండ’ మూవీని హిందీలో రిలీజ్ చేయాలంటూ నార్త్ ఇండియన్ ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. ''అఖండ మూవీ ప్రౌడ్ ఫర్ సనాతన్'' ధర్మ అంటూ హిందీ వర్షన్ ఈ మూవీ కోరుతున్నారు. ఈ మేరకు #WeWantAKHANDAInHindi హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. అఖండ పోస్టర్స్ షేర్ చేస్తూ తమ తమ డిమాండ్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో విడుదలై 50 రోజులు పూర్తయ్యాక కూడా అఖండ మూవీ ట్రెండ్ అవుతుండటం విశేషం. బాలకృష్ణ- బోయపాటి హాట్రిక్ కాంబోలో వచ్చిన 'అఖండ' సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇటీవలే 103 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. మరోవైపు ఓటీటీలో విడుదలై భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. జనవరి 21 సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్స్ స్టార్ట్ కాగా తొలి 24 గంటల్లో పది లక్షల స్ట్రీమింగ్స్ సాధించి డిజిటల్ రంగంలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించింది. చిత్రంలో బాలయ్య నటన, బోయపాటి టేకింగ్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేశాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా త్వరలో యూట్యూబ్‌లో హిందీ వర్షన్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qW7Can

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....