Sunday, 23 January 2022

అల్లు అర్జున్‌, య‌ష్ స‌హా ద‌క్షిణాది స్టార్స్‌కి కంగ‌నా జాగ్ర‌త్త‌లు! బాలీవుడ్ ఉచ్చులో చిక్కుకోవ‌ద్ద‌ని స‌ల‌హా!

కంగ‌నా ర‌నౌత్‌.. బాలీవుడ్‌లో ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తూ స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్‌. సినిమాల ప‌రంగా ఆమె చాలా ఒడిదొడుకుల‌నే ఎదుర్కొన్నార‌నే సంగ‌తి తెలిసిందే. ఇక ఆమెకు వివాదాలు కూడా ఏమీ కొత్త కావు. హృతిక్ రోష‌న్‌తో బ‌హిరంగంగా గొడ‌వ‌ప‌డ్డా..బాలీవుడ్‌లోనెపోటిజంపై ఘాటు వ్యాఖ్య‌లు చేసినా.. తాప్సీ, ఆలియా వంటి స్టార్ హీరోయిన్స్‌పై మాట‌ల‌తో డైరెక్ట్ ఎటాక్ చేసినా ఆమెకే చెల్లింది. కంగ‌నా ర‌నౌత్ ప‌లు సంద‌ర్భాల్లో ఘాటు వ్యాఖ్య‌లు చేస్తుంటారు. వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు వ్య‌క్తుల‌తోనే కాదు.. ఏకంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతోనే ఆమె మాట‌ల యుద్ధం చేస్తూ వ‌స్తున్నారు. దేశ రాజ‌కీయ ప‌రిస్థితులపై కంగ‌నా తూటాల్లాంటి మాట‌ల‌తో ఫైర్ బ్రాండ్‌లా మారిపోయింది. లేటెస్ట్‌గా త‌న‌దైన స్టైల్లో బాలీవుడ్‌పై విరుచుకుప‌డింది. అయితే ఈసారి ఆమె ద‌క్షిణాది తార‌ల‌కు త‌న మ‌ద్ద‌తుని తెలిపారు. రీసెంట్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో ‘పుష్ప ది రైజ్’ మూవీ భారీ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా ‘పుష్ప ది రూల్’ రానుంది. మ‌రో వైపు ద‌క్షిణాది నుంచి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న భారీ పాన్ ఇండియా మూవీ KGF Chapter2 విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల్లో న‌టిస్తున్న హీరోలు అల్లు అర్జున్‌, య‌ష్ ఫొటోల‌ను షేర్ చేసిన కంగ‌నా రనౌత్ దక్షిణాది సినిమాలు, హీరోలకు ఆదరణ ఎక్కువగా ఉండటంపై స్పందిస్తూ 1. దక్షిణాది స్టార్స్ మ‌న దేశ సంస్కృతి సంప్ర‌దాయ మూలాల‌కు క‌ట్టుబ‌డి ఉంటారు. 2. వారు త‌మ కుటుంబాల‌కు, బాంధ‌వ్యాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు3. సినిమాపై వారికున్న ప్యాష‌న్‌, వృతిప‌ర‌మైన నిబ‌ద్ధ‌త అపార‌మైన‌ది వంటి కార‌ణాల‌ను వివ‌రించారు. ఇదే పోస్ట్‌లో ఆమె బాలీవుడ్ మిమ్మ‌ల్ని పాడు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. వారి వ‌ల‌లో చిక్కుకోకండి అంటూ సూచ‌న కూడా చేశారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. జ‌య‌లలిత జీవితం ఆధారంగా రూపొందిన త‌లైవి సినిమాలో టైటిల్ రోల్‌లో కంగ‌నా ర‌నౌత్ న‌టించింది. త‌ర్వాత ఆమె ఏ సినిమా ఇంకా విడుద‌ల కాలేదు. అన్ని సినిమాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. థాక‌డ్ వంటి పూర్తి స్థాయి యాక్ష‌న్ సినిమాతో ఆక‌ట్టుకోవ‌డానికి రెడీ అయ్యారు. తేజ‌స్ సినిమాలో యాక్ట్ చేస్తున్న కంగ‌నా ర‌నౌత్ ఇప్పుడు త‌న సొంత బ్యాన‌ర్‌లో టీకు వెడ్స్ షేరు అనే సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. వీట‌న్నింటితో పాటు ఇందిరా గాంధీ బ‌యోపిక్‌లోనూ ఆమె న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం భార‌త‌దేవ ఉక్కు మ‌హిళ అయిన ఇందిరా గాంధీ జీవితానికి సంబంధించిన విశేషాల‌ను తెలుసుకుని క‌థ‌ను రూపొందించే ప‌నిలో కంగన అండ్ టీమ్ వ‌ర్క్ చేస్తుంది. దీనికి ఎమెర్జెన్సీ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3KzOzup

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...